Friday, April 26, 2024
- Advertisement -

జ‌య‌రాం మృతికేసులో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన నిందితుడు రాకేష్‌..

- Advertisement -

చిగురుపాటి జ‌య‌రాం కేసు విచార‌ణ‌లో మ‌రిన్ని సంచ‌ల‌న నిజాలు వెల్ల‌డించారు నిందితుడు రాకేష్‌. మూడు రోజుల కోర్టు కస్టడీలో భాగంగా నేడు రాకేష్ రెడ్డిని జూబ్లీ హిల్స్ పో లీసులు విచారిస్తున్నారు. విచార‌ణ‌లో పోలీసులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఉక్కిరిబిక్కిరి అయిన‌ట్లు తెలుస్తోంది. జ‌య‌రాంను తాను చంపాల‌నుకొనే ఉద్దేశ్యం నాకులేద‌ని విచార‌ణ‌లో రాకేష్ తెలిపిన‌ట్లు తెలుస్తోంది. ఇది ప్రి ప్లాన్డ్ మర్డర్ కాదు.. తాను కొట్టిన దెబ్బలకు అనారోగ్యంతో ఉన్న జయరాం చనిపోయాడని చెప్పుకొచ్చాడు. డ‌బ్బుల‌కోస‌మే అమ్మాయి పేరుతో ట్రాప్ చేసి జయరాంను తన ఇంటికి పిలిపించుకున్నారు. డ‌బ్బుల వివాదంలో తాను కొట్టడంతో జయరాం మృతిచెందాడని చెప్పాడు. జనవరి 31న జయరాం బాడీని కారులో వేసుకుని హైదరాబాద్‌లో తిరిగానని అత‌ర్వాత‌..మధ్యాహ్నం 4 గంటలకు జయరాం డెడ్ బాడీతో నల్లకుంట పోలీసుస్టేషన్‌కు కూడా వెళ్లాలనన్నారు. జ‌య‌రాంను హ‌త్య చేసిన రోజునల్లకుంట సీఐ శ్రీనివాసరావు‌తో 13 దఫాలు, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో 29 దఫాలు రాకేష్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించారు. వారి సూచ‌న‌ల‌తోనే హ‌త్య‌ను ప్ర‌మాదంగా చిత్రీక‌రించాల‌నుకున్నాన‌ని రాకేష్ రెడ్డి పోలీసుల‌కు తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -