Friday, March 29, 2024
- Advertisement -

వేశ్య పాత్ర‌లో ఎంజాయ్ చేసింద‌ట‌..!

- Advertisement -

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగింది ర‌మ్య‌కృష్ణ‌. హీరోయిన్‌గా అవ‌కాశాలు త‌గ్గ‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్‌గా మారి సినిమాలలో న‌టిస్తోంది. ఆ మ‌ధ్య కొన్ని ఐటం సాంగ్స్‌లో కూడా న‌టించింది. కాని హీరోయిన్‌గా రాని పేరు ఒక్క బాహుబ‌లి సినిమాతో వ‌చ్చింది. ఈ సినిమాలో శివ‌గామిగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ‌కు నేష‌న‌ల్ లేవ‌ల్లో క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ర‌మ్య‌కృష్ణ‌కు అన్ని భాష‌ల నుంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయాట‌. దీనిలో భాగంగానే ఆమెకు ఓ వేశ్య పాత్ర వ‌చ్చింద‌ని తెలుస్తోంది. గ‌తంలోనే ఇలాంటి వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికి వాటిపై స్పందించ‌లేదు.

కాని తాజాగా వేశ్య పాత్ర‌పై స్పందించింది ర‌మ్య‌కృష్ణ‌. ఈ పాత్ర తాను స్ప‌ష్టం చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేసింది. ఎంతో ఇష్టంతో సినిమా చేస్తున్నట్లు వెల్లడించింది. దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజ రూపొందిస్తోన్న ‘సూపర్ డీలక్స్’ సినిమాలో విజయ్ సేతుపతి స్వలింగ సంపర్కుడి పాత్రలో నటిస్తుండగా, రమ్యకృష్ణ శృంగారతారగా నటిస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమాలో ఓ స‌న్నివేశంలో న‌టించ‌డానికి 37 టేకులు తీసుకుంద‌ట ర‌మ్య‌కృష్ణ‌. ఈ సీన్‌ను పూర్తి చేయ‌డానికి రెండు రోజులు ప‌ట్టింద‌ట‌. ఈ సినిమా మాత్రం ఇష్టంతో చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించింది ర‌మ్య‌కృష్ణ‌. శివ‌గామిగా ఓ ఊపు ఊపిన ర‌మ్యకృష్ణ‌, వేశ్యగా ఎలా న‌టిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -