Thursday, April 18, 2024
- Advertisement -

ఏపీలో రాయలసీమ ఉద్యమం..కలకలం

- Advertisement -

వెనుకబడిన వారు తిరగబడుతారు.. హక్కుల కోసం పోరాడుతారు.. అభివృద్ధి చెందిన వారు అడ్డుకుంటారు.. వీరుంటే మాకు లాభమని మోకాలడ్డుతారు. తెలంగాణ విడిపోవడాన్ని ఆంధ్రా జనాలు ఎలా వ్యతిరేకించారో ఇప్పుడు సీమలో ‘హైకోర్టు’ ఏర్పాటును కోస్తా జిల్లా న్యాయవాదులు, నేతలు వ్యతిరేకండం హాట్ టాపిక్ గా మారింది.

కర్నూలు జిల్లాలో న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకుడు రిలే నిరాహార దీక్షలతో హోరెత్తిస్తున్నారు. 12 రోజులుగా పోరాడుతున్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి జరగడానికి ఇదే సరైన సమయం అని.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేంత వరకూ తాము నిరాహార దీక్షలు కొనసాగిస్తామని జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

అయితే కర్నూలులో హైకోర్టు ఏర్పాటైతే తమకు అన్యాయమని రాజధాని అమరావతి చుట్టుపక్కల జిల్లాల న్యాయవాదులు తాజాగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రెండు రోజులుగా హైకోర్టు విధులను బహిష్కరించారు. గుంటూరులో న్యాయవాదులు పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. తూరు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా,గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్లు జేఏసీగా ఏర్పడి కర్నూలుకు హైకోర్టు తరలిపోకుండా అడ్డుకుంటామని ప్రతిన బూనారు. గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ను కలిసి వినతిపత్రం అందించారు.

ఇలా రాయలసీమ వాసులు కర్నూలులో హైకోర్టు అని ఉద్యమించగానే కోస్తా జిల్లాల లాయర్లు ఇక్కడే ఉంచాలని పోరుబాట పట్టారు. ఏపీలో రెండు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన హైకోర్టు వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీమ నిరసనకారులకు కోస్తా లాయర్ల పోరాటం మరింత కసినిపెంచి అంతిమంగా ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి పురుడు పోసుకోవచ్చనే ఆందోళన కూడా అంతటా వ్యక్తమవతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -