Thursday, April 25, 2024
- Advertisement -

రాము గడప తొక్కుతోన్న కడప గొడవ

- Advertisement -

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై రాయలసీమ జనాలు విరుచుకుపడుతున్నారు. రాము చేసిన కడప ట్రైలర్ ,పాటలపై సీమ నెటిజన్లు విపరీతమైన కోపోద్రిక్తులయ్యారు.చివరకు ఇది అటుతిరిగి ఇటుతిరిగి పొలిటికల్ టచ్ తో పటాసై కూర్చుంది. వర్మ కడప మీద వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన టైమ్లో అక్కడి వ్యవస్థను టార్గెట్ చేస్తాడనుకున్నారంత. కాని అదేంటో వర్మ ఎవ్వరూ ఊహించని విధంగా ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం ఏమాత్రం భాగా లేదని అక్కడివారు వాపోతున్నారు.ఇదే రాయలసీమలో అనంతపురం,చిత్తూరు కూడా జిల్లాలే కదా. ఆ ప్రాంతంలో మిగతా సామాజిక వర్గాలు కూడా ఫ్యాక్షన్ నేపద్యంలో ఎన్నో దారుణాలు చేశాయనే విషయం వర్మకు తెలియదా అంటున్నారు.

సీమవాసులు ‘కడప’ ట్రైలర్ మీద పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు. కొవ్వెక్కి రాయలసీమ ప్రజల్ని అవమానిస్తే తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. త్వరలోనే ‘వర్మగారు పోతున్నారు పిచ్చాసుపత్రికి’ అనే సినిమా తీస్తున్నామంటున్నారు.ఇందులో పూర్తిగా వర్మ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించే ఈ సినిమా కోసం వర్మ తల్లితోపాటు అతని కుటుంబసభ్యులు, సన్నిహితులు, చిన్ననాటి స్నేహితులను కలుస్తామని తెలిపారు.

వర్మ ఇలా తయారవ్వడానికి దారితీసిన పరిస్థితులను క్షుణ్ణంగా ఆ సినిమాలో చూపిస్తామంటున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాకి సంబంధించి నిర్మాణం షురూ చేస్తామని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.దీంతో కడప వెబ్ సిరీస్ కు అనుకోకుండానే మైలేజ్ పెరిగిపోయింది. కాంట్రవర్సీ చేస్తేనే తన ప్రాజెక్ట్ లను పబ్లిక్ లోకి తీసుకుపోవచ్చు అనుకునే రాముకు… కడప వెబ్ సిరీస్ ఎఫెక్ట్ మాత్రం గట్టిగానే సమాధానం ఇచ్చేలా ఉంది. అయితే ఇది వెబ్ సిరీస్ అంటున్నాడు కాబట్టి పరిటాల,కప్పట్రాల లాంటి మిగతా వర్గాలను కూడా భవిష్య త్ లో చూపిస్తానని చెప్పి ఇప్పటి బాధితులను కూల్ చేసే ప్రయత్నం కూడా చేయెచ్చు. చూద్దాం కడప గొడవ..రాము గడప ఎలా తొక్కుతుందో .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -