Wednesday, April 24, 2024
- Advertisement -

బ్యాంకు క‌ష్ట‌మ‌ర్ల‌కు తీపి క‌బురు అందించిన ఆర్బీఐ….

- Advertisement -

గృహ, వ్యక్తిగత, వాహన రుణాల వినియోగదారులకు కేంద్ర బ్యాంక్‌ తీపికబురు అందించింది. భారత ఆర్థిక వృద్ధిరేటుకు ఊతం ఇచ్చేలా రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.25 బేసిస్ పాయింట్లు త‌గ్గిస్తున్న‌ట్లు ఇవాళ ఆర్బీఐ ప్ర‌క‌టించింది. బ్యాంకులకు ఆర్‌బీఐ అందించే స్వల్పకాల రుణాలపై విధించే వడ్డీని రెపో రేటుగా పరిగణిస్తారు. రెపో రేటు తగ్గడంతో తదనుగుణంగా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది.

ఇప్పుడు బ్యాంకులు త‌క్కువ వ‌డ్డీకే రుణాలు ఇచ్చే అవ‌కాశం ఉంటుంది. దీంతో ఈఎంఐల వాటా కూడా త‌గ్గే అకాశం ఉంది. ఇండ్లు, కార్ల కోసం రుణాలు తీసుకునేవారికి, కార్పొరేట్ సంస్థ‌ల‌కు ఇది నిజంగా శుభ‌వార్తే. రెపో రేటును 6 శాతం నుంచి 5.75 శాతానికి త‌గ్గించారు. రివ‌ర్స్ రెపో రేట‌ను 5.50, బ్యాంక్ రేటును 6.0గా ఫిక్స్ చేశారు. వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించాల‌ని ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఇవాళ ముంబైలో ఆర్బీఐ వెల్ల‌డించింది.

డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ లావాదేవీలపై ఛార్జీలను తొలగించింది. అయితే ఈ బెనిఫిట్‌ను ఆయా బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల‌కు క‌ల్పించాల‌ని ఆర్బీఐ పేర్కొన్న‌ది. ఏటీఎం వాడ‌కంపై విధించే చార్జీలు గురించి అధ్య‌య‌నం చేసేందుకు క‌మిటీని ఏర్పాటు చేసిన‌ట్లు ఆర్బీఐ చెప్పింది. ఇండియ‌న్ బ్యాంక్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ త‌న రిపోర్ట్‌ను రెండు నెల‌ల్లో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -