Friday, April 26, 2024
- Advertisement -

త్వ‌ర‌లో రూ.20 నోటు విడుద‌ల‌…..

- Advertisement -

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనుంది. ఈమేర‌కు ఆర్బీఐ ప్ర‌క‌టించింది. మహాత్మాగాంధీ సిరీస్ లో ఈ నోటు విడుదలవుతోంది. ఆర్మీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సంతకంతో విడుదలవుతున్న ఈ నోట్ల గురించి కొన్ని ఆసక్తి వివరాలు.నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, పక్కనే దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంది. అలాగే అశోకుడి స్థూపం కూడా ఉంది. ఇక నోటు వెనకభాగంగంలో ఎల్లోరా గుహల చిత్రంతోపాటు స్వచ్ఛ భారత్‌ లోగో, నినాదం ఉన్నాయి.

రూ.20 నోటు ప్ర‌త్యేక‌త‌లు…

నోటు సైజు 63 మి.మీ x 129 మి.మీ.
నోటు ఒక వైపున్న సీత్రూ ప్రాంతంలో 20 సంఖ్య కనిపిస్తుంది. దేవనాగలి లిపిలో కూడా ఈ నంబర్ ఉంటుంది.
నోటుకు ఒక వైపు మధ్యలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది. ఆర్బీఐ, భారత్, ఇండియా, 20 కనిపిస్తాయి.
గాంధీకి కుడివైపున ప్రామిస్ క్లాజ్, ఆర్బీఐ గవర్నర్ సంతకం, ఆర్బీఐ చిహ్నం ఉంటాయి.
గాంధీ బొమ్మకు మరోవైపున అశోక స్తంభం, 20 సంఖ్య వాటర్ మార్క్ లు ఉంటాయి.

నోటుకు మరోవైపున ఎడమపక్కన నోటును ప్రింట్ చేసిన సంవత్సరం ఉంటుంది. స్వచ్ఛభారత్ నినాదంతో పాటు లోగో ఉంటుంది.
అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో నోటు విలువ రాసి ఉంటుంది.
ఎల్లోరా గుహల చిత్రం ముద్రించి ఉంటుంది.
ఈ నోట్లు ఆకుపచ్చ, పసుపు మిశ్రమ రంగుతో ముద్రించి ఉంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -