ఏటీఎంల‌ను ఖాలీగా ఉంచె బ్యాంకుల‌కు ఆర్బీఐ షాక్‌…

205
RBI tightens noose around banks to impose penalty for keeping ATMs
RBI tightens noose around banks to impose penalty for keeping ATMs

ఏటీఎంల‌ నిర్వ‌హ‌ణ విష‌యంలో ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏటీఎం మిష‌న్ల‌లో న‌గ‌దు నింప‌కుండా ఉండే బ్యాంకుల షాక్ ఇచ్చింది. ఈ మ‌ధ్య కాలంలో చాలా ఏటీఎంలు ‘నో క్యాష్’ బోర్డుతో కనిపించడం పరిపాటిగా మారింది. దీంతో ఖాతాదారులు అసహ‌నం వ్య‌క్తం చేసేవారు. కాని ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి ఉండ‌దు.

రోజుల తరబడి ఏటీఎంల్లో నగదు నింపకుండా, వినియోగదారులను అసౌకర్యానికి గురిచేసే బ్యాంకులపై కఠినచర్యలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఉపక్రమించింది. మూడు గంటలకు మించి ఏటీఎంలు నగదు లేకుండా ఖాళీగా ఉండరాదని, నిర్ణీత వ్యవధి దాటిపోతే బ్యాంకులకు జరిమానా తప్పదని ఆర్బీఐ హెచ్చరించింది. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలను బట్టి జరిమానా విధించనున్నారు. ఏదేమైనా, ఆర్బీఐ తాజా నిర్ణయం ఏటీఎం వినియోగదారులకు నిస్సందేహంగా తీపికబురేనని చెప్పాలి.

Loading...