Friday, April 26, 2024
- Advertisement -

మాజీ ఎంపీ రాయపాటిపై సీబీఐ రైడ్స్.. కారణమిదే.?

- Advertisement -

ఏపీలో సీనియర్ నాయకులు, టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు చిక్కుల్లో పడ్డారు. ఆయన ఇల్లు, ఆఫీసులపై సీబీఐ ఏకకాలంలో దాడులు మొదలుపెట్టింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేంద్రమంత్రిగా వెలుగు వెలిగిన రాయపాటి ప్రముఖ పారిశ్రామికవేత్తగా కూడా పేరొందారు. ఆయనకు ట్రాన్స్ ట్రాయ్ అనే కంపెనీ కూడా ఉంది.

గుంటూరులోని రాయపాటి నివాసంతోపాటు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరుల్లోని ఆయన ఇళ్లు, ఆఫీసులపై ఈ తెల్లవారుజామున నుంచి అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రాయపాటి కి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వివరాలను ఆరాతీస్తున్నారు.

సీబీఐ దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే..
రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వివిధ బ్యాంకుల నుంచి వ్యాపారం నిమిత్తం ఏకంగా 300 కోట్ల రూపాయల దాకా రుణం తీసుకుంది. అయితే బ్యాంకులకు రుణం చెల్లించకుండా ఆ సంస్థ కాలయాపన చేస్తోంది. దీంతో రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ, దాని యజమాని అయిన రాయపాటిపై ఇండియన్ బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది. ట్రాన్స్ ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్ ఇంట్లో సైతం సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి.

చంద్రబాబు హయాంలో రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టింది.. కాలయాపన చేసి జాప్యం చేసింది. జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ కాంట్రాక్టును రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించింది.

రాయపాటి సాంబశివరావు కొద్దికాలంలో టీడీపీలో సైలెంట్ గా ఉంటున్నారు. ఇలాంటి ఆర్థిక లావాదేవీల కారణంగానే ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆక్రమంలోనే తాజాగా బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో సీబీఐ దాడులతో వార్తల్లో నిలిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -