Saturday, April 20, 2024
- Advertisement -

ఆర్థిక సంక్షోభమే కోడెల ఆత్మహత్యకు కారణమా?

- Advertisement -

వైసీపీ వేధింపులు, కేసులు ఒత్తిడి వల్లే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.. మీడియా కూడా దీన్ని చిలవలు పలవులు చేసి ఆడిపోసుకుంటోంది.

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం కోడెల తన చివరి రోజుల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడని.. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి గెలవకపోవడంతో అప్పుల పాలయ్యాడని.. ఆర్తికంగా చితికి అప్పులు తీర్చే మార్గంలేకే తనువు చాలించినట్టు ఆయన సన్నిహిత వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కెన్యాలో వ్యాపారం చేస్తున్న ఆయన కుమారుడు శివరాం.. కోడెలపై పెట్టిన భారీ పెట్టుబడి తిరిగి రాకపోవడంతో తండ్రిపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ఇక 90 లక్షల బాకీ ఉన్న వ్యక్తికి చెక్ ఇవ్వగా అది బౌన్స్ కావడంతో ఆ వ్యక్తి కోడెలను మోసగాడంటూ తిట్టారని సమాచారం. కోడెల శివరాం ఇప్పటికే కెన్యాలో రెండు వేల ఎకరాలు కొనేందుకు ఉన్న డబ్బంతా అక్కడికి తీసుకెళ్లడంతో ఇక డబ్బులు లేక కోడెల అవమానపడినట్టు తెలిసింది.

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో 90 లక్షల బాకీ చెల్లించలేక ఇక నర్సారావుపేటలోని కేబుల్ ఆపరేటర్లకు కూడా చెల్లించాల్సిన జీతాలు చెల్లించలేక కోడెల సతమతమైనట్టు తెలిసింది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యానే కోడెల సూసైడ్ చేసుకుంటే ఆయన చావును మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు రాజకీయంగా వాడుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు ఆడిపోసుకుంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -