Thursday, April 25, 2024
- Advertisement -

తాడిపత్రి ప్రభోదానందాశ్రమం….. హత్యలు చేసినా ఇలాగే మేనేజ్ చేస్తారా?

- Advertisement -

జేసీలు కాంగ్రెస్‌లో ఉన్నప్పటి ఒక సంఘటన గుర్తుచేసుకుందాం. జేసీ ప్రభాకరరెడ్డి ఒక ట్రాన్స్‌పోర్ట్ అధికారితో గొడవపడ్డప్పుడు ఇదే చంద్రబాబు ఆయన భజన మీడియాతో కలిసి కులం పేరుతో జేసీ దూషించాడని రెచ్చిపోయారు. జేసీల రాక్షసత్వాన్ని వైఎస్ వెనకేసుకొస్తున్నాడని నానా రచ్చా చేశారు.

ఇక ప్రస్తుతానికి వద్దాం. అదే జేసీ ప్రభాకరరెడ్డి 2017 జూన్‌లో ఆశ్రమానికి సంబంధించిన ట్రాక్టర్‌ని అడ్డుకున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్‌ని కులం పేరుతో దూషించాడు. ఆ డ్రైవర్ పోలీస్ కేస్ పెట్టాడు. కానీ పోలీసులు అధికార టిడిపి తొత్తులుగా వ్యవహరించడంతో ఆ డ్రైవర్ హ్యూమన్ రైట్స్ కమీషన్‌ని ఆశ్రయించాడు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలతో జేసీ ప్రభాకరరెడ్డిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

ఇక అప్పటి నుంచీ జేసీలు ప్రభోదానంద ఆశ్రమంపై పగబట్టారు. మొత్తం ఆ ఆశ్రమ నిర్వాహకులు తమకు వ్యతిరేకంగా ఉన్నారని కక్ష్యగట్టారు. ఆశ్రమంలో ఏదో జరిగిపోతోందని చెప్పి అనుచరులతో ఆశ్రమంలో ఉన్నవాళ్ళపై దాడి చేయించారు. రాళ్ళ వర్షం కురిపించారు. స్వయానా జేసీ దివాకరరెడ్డి కూడా రెచ్చిపోయారు. ఇదీ జరిగిన వాస్తవం.

కానీ పచ్చ మీడియాకు మాత్రం ఇప్పుడు జేసీల అరాచకత్వం అస్సలు కనిపించదు. ఎందుకంటే ప్రస్తుతం జేసీలు చంద్రబాబు భజన చేస్తున్నారు. టిడిపి పార్టీలో ఉన్నారు. చంద్రబాబుకు జై కొడుతూ ఉంటే చాలు………వాళ్ళను రాక్షసులైనా సరే……..దేశాన్ని ఉద్ధరించడానికి దేవుళ్ళు అని నమ్మించగల సమర్థత పచ్చ బ్యాచ్ సొంతం మరి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరగా పరిశీలిస్తున్న విశ్లేషకులు మాత్రం ఎపి ప్రజలను హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నైజం, పచ్చ మీడియా ప్రచార మాయను ఇప్పటికైనా ఎపి ప్రజలు తెలుసుకోకపోతే భవిష్యత్తులో ప్రజల ధన, మాన, ప్రాణాలకు కూడా రక్షణలేని పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రిలో ఏర్పడిన పరిస్థితులే భవిష్యత్తులో రాష్ట్రమంతటా కనిపిస్తాయని చెప్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోనూ, గోదావరి జిల్లాల్లోనూ 144 సెక్షన్ విధించి పాలించిన చరిత్ర బాబు సొంతం. ఇప్పుడు తాడిపత్రిలో కూడా అలానే చేసి ఆ ఆశ్రమాన్ని కొల్లగొట్టేస్తారేమో చూడాలి. కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిది అన్న ముద్ర వేయాలట. ప్రభోదానంద ఆశ్రమంపై ప్రస్తుతం ఈ ముద్రవేసే ప్రయత్నంలోనే పచ్చ బ్యాచ్ జనాలు, పచ్చ మీడియా జనాలు ఉన్నారు. ఆ విషయంలో సక్సెస్ అయిన వెంటనే ఆశ్రమంతో పాటు ఆశ్రమం ఆస్తులు కూడా పూర్తిగా కబ్జా చేసేస్తారనడంలో సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -