Saturday, April 20, 2024
- Advertisement -

పోలవరం రీ-టెండరింగ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం

- Advertisement -

ఏపీ సీఎం జగన్ ఎంత పట్టుదల వ్యక్తో చెప్పాల్సిన పనిలేదు. ప్రజల మంచి కోసం ఎలాంట నిర్ణయాలైనా తీసుకుంటారు. ఎవరినీ లెక్కచేయరు…ఎవరి ఒత్తిల్లు పట్టించుకోరు. అలాంటిది పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం సూచలనను కూడా బేఖాతరు చేస్తూ రివర్స్ టెండర్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఈ టెండర్ నోటిఫికేషన్ ను జలవనరులశాఖ వెబ్ సైట్ లో పెట్టింది.

మొత్తం రూ. 4,900 కోట్లతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభంచింది. ఇందులో హెడ్ వర్క్ పనులకు రూ. 1,800 కోట్లు, హైడల్ ప్రాజెక్టు పనులకు రూ. 3,100 కోట్ల అంచనాలతో టెండర్ల నోటిఫికేషన్ ను విడుదల చేసింది.పోలవరం ప్రాజక్టు నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్ వల్ల నష్టమని పీపీఏ సీఈఓ లేఖ రాశాడు. ఈ లేఖను కూడ ఖాతరు చేయకుండా రివర్స్ టెండరింగ్ కు ఏపీ సర్కార్ శనివారం నాడు టెండర్లను ఆహ్వానించింది.

2015-16 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించింది. గతంలో అంచానాలను భారీగా పెంచారని ప్రభుత్వం ఆరోపించిన సంగతి తెలిసిందే.వర్స్ టెండరింగ్ కు వెళ్లవద్దంటూ కేంద్ర జల వనరుల శాఖ చేసిన సూచనలను, అలాగే ప్రాజెక్టు త్వరగా పూర్తవ్వాలంటే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఆర్కే రాసిన లేఖను సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -