Saturday, April 20, 2024
- Advertisement -

అరుణ్ జైట్లీ మృతికి సంతాపం తెలిపిన రాజకీయ ప్రముఖులు

- Advertisement -

భాజాపా సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈనెల 9న జైట్లీ ఎయిమ్స్‌లో చేరగా.. 20వ తేదీ నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న ఆయన మధ్యాహ్నం 12.07 నిముషాలకు తుది శ్వాస వదిలారు.

జైట్లీ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంటేరియన్ గా, ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ అందించిన సేవలు మరువలేనివని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జైట్లీ మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని తెలిపారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

జైట్లీ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ గారు ఇక లేరని వినాల్సి రావడం నిజంగా బాధాకరం. ఆయన తెలివైనవారు, స్నేహపూర్వకమైన వ్యక్తి. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో దేశానికి గుర్తించదగ్గ సేవలను జైట్లీ అందించారు. ప్రతీసారి విలువలకు కట్టుబడ్డారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని జగన్ ట్వీట్ చేశారు.

అరుణ్‌జైట్లీ మృతి తీవ్రంగా కలచివేస్తోంది. వ్యక్తిగతంగా నాకు పెద్ద లోటు. మా కుటుంబ సభ్యుడినే కోల్పోయినంత బాధగా ఉంది. నాకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి ఆయనని కేంద్ర హోమంత్రి అమిత్ షా కొనియాడారు.

జైట్లీ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. అరుణ్ జైట్లీ భార్య సంగీత, కొడుకు రోహన్‌కు కాల్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ… తన సంతాపాన్ని తెలిపారు.

మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఓ మంచి స్నేహితుడ్ని కోల్పోయానంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచి కోలిగ్‌ను కూడా కోల్పోయానంటూ ఆయన ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -