గుడ్ న్యూస్ : తొలి కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది..!

1104
Russia Announces World's First Corona Vaccine
Russia Announces World's First Corona Vaccine

ప్రపంచాన్నే గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. కరోనాను అంతం చేసే వాక్సిన్ మొదట మా నుంచే వస్తుందని రష్యా ఇప్పటికే ప్రజటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రష్యా నుంచి కరోనా వైరస్ కు తొలి వ్యాక్సిన్ వచ్చింది.

ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా ప్రకటన చేశారు. ప్రపంచంలోనే తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్ ను రష్యా నమోదు చేసిందని మంగళవారం ఉదయం మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో పుతిన్ తెలిపారు. వ్యాక్సిన్ పనితీరుపై తనకు సమాచారం ఇవ్వాలని ఆరోగ్య మంత్రి మైఖైల్ మురష్కోను ఆయన కోరారు. అలానే తన కుమార్తెకు టీకా వేయించినట్లు పుతిన్ తెలిపారు. ఈ టీకా ద్వారా రోగనిరోధకత పెరిగి కరోనా నియంత్రణలోకి వస్తుందని చెప్పారు.

ఈ వ్యాక్సిన్ ను మొదట వైద్య సిబ్బంది ఉపాధ్యాయులు చిన్నారులకు వేయనున్నట్లు తెలిపారు. దీనితో కరోనా వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా నిలిచింది. రష్యాకు చెందిన గామలేయా ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్లకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 7.35 లక్షల మంది మహమ్మారి బారినపడి మరణించారు. 1.2 లక్షల మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో అగ్నిప్రమాదం.

రాయలసీమ ఎత్తిపోథల పథకం కి మరో ముందడుగు…

కోవిడ్ బాధితుల కోసం అండగా నిలబడిన అనంత

ప్రజలు కాల్ చేస్తే వెంటనే స్పందించాలి : అధికారులకు సీఎం ఆదేశాలు

Loading...