Thursday, April 25, 2024
- Advertisement -

అలాంటి వారిలో మగ‌వారే ఎక్కువ – సానియా మీర్జా

- Advertisement -

ఇండియ‌న్ టెన్నిస్ ప్లేయ‌ర్ సానియా మీర్జా నెటిజ‌న్లపై పైర్ అయింది. సానియా మీర్జా ప్రస్తుతం గర్భవతి అన్న విషయం తెలిసిందే. ఈ సంవ‌త్స‌రంలోనే ఆమె బిడ్డ‌కు జ‌న్మనివ్వ‌బోతుంది. సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు తనకు ఉచిత సలహాలు ఇస్తుండటంపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసింది.

గర్భం ధరించిన మహిళలు తొమ్మిది నెలలపాటు బయటకు కనిపించకుండా ఇంట్లోనే ఉండాలని తనకు ఉచిత సలహాలు ఇచ్చే వారు అనుకుంటున్నారని, అలాంటి సలహాలు ఇచ్చే వారిలో ఎక్కువ మంది మగవారే ఉన్నారని పేర్కొంది. ఈ స్థితిలో ఉన్నందుకు సిగ్గుపడి ఇంట్లోనే కూర్చోవాలనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించింది. గర్భవతులు కూడా మనుషులే, సాధారణ జీవితం గడిపే అనుమతి వారికీ ఉందని, కాలు కదపకుండా ఇంట్లోనే కూర్చోవాలనుకునే ఆలోచనలు మానుకోవాలంటూ తన ట్వీట్లో క్లాస్ పీకింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -