Thursday, March 28, 2024
- Advertisement -

శానిటైజర్లను ఎక్కువగా వాడితే ప్రమాదమట..!

- Advertisement -

కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుకోవాలని వైద్యులు సూచిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం చాలా మంది శానిటైజర్లను విపరీతంగా వాడుతున్నారు. పదే పదే శానిటైజర్లతో చేతులు కడుకుంటున్నారు.

అయితే.. శానిటైజర్లు కరోనా వంటి వైరస్ లను చంపేయడానికి ఉపయోగపడుతున్నప్పటికీ విపరీతంగా వాడితే నష్టాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ శానిటైజర్ల వల్ల అరచేతిలో ఉండే చెడ్డ బ్యాక్టీరియా, వైరస్ లతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుందని చెబుతున్నారు. మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లకపోతే రోగాల బారిన పడతామని అంటున్నారు.

సబ్బుతో చేతులు కడుక్కునే పరిస్థితులు ఉంటే శానిటైజర్‌ వాడకానికి దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు. మన చేతులపై దుమ్ము బాగా ఉన్నప్పుడు శానిటైజర్‌ను‌ ఉపయోగించొద్దని చెబుతున్నారు. అలాంటి సమయంలో శానిటైజర్లు క్రిముల్ని చంపలేవని చెబుతున్నారు. కాగా, చిన్న పిల్లలను శానిటైజర్‌కు దూరంగా ఉంచాలని, వాటిని పిల్లలు తాగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -