Friday, March 29, 2024
- Advertisement -

జీఎస్‌టీకి అనుగునంగా చార్జీల స‌వ‌ర‌న చేసిన ఎస్‌బీఐ

- Advertisement -

దేశ వ్యాప్తంగా జీఎస్‌టీ అములులోకి తీసుకొచ్చింది.ఇప్ప‌టికే అన్ని రంగాల‌లో దీన్ని అముల చేస్తుండ‌గా అతి పెద్ద‌ ప్ర‌భుత్వం రంగ సంస్థ ఎస్‌బీఐ కూడా జీఎస్‌టీని అమ‌లు చేయ‌నుంది.దీనికి అనుగునంగా ఆన్‌లైన్‌లో నగదు బదిలీ సేవలపై ఛార్జీలను ఎస్‌బీఐ సవరించింది. త‌క్ష‌ణ‌ పేమెంట్‌ సర్వీస్‌(ఐఎంపీఎస్‌) ఛార్జీలను సవరిస్తూ కొత్త రేట్లను ట్విటర్‌లో ప్రకటించింది.

ఐఎంపీఎస్‌ కింద రూ.1000 వరకు ఇతర ఖాతాలకు పంపిస్తే ఎలాంటి రుసుములు ఉండవు. రూ.1000 నుంచి రూ.లక్ష వరకు పంపిస్తే రూ.5ను రుసుముగా వసూలు చేస్తారు. అలాగే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు మనీ ట్రాన్స్‌ఫర్‌పై రూ.15ను ఛార్జీగా వసూలు చేస్తారు. ఈ రుసుములకు జీఎస్టీ 18 శాతం అదనమని బ్యాంక్‌ ప్రతినిధులు తెలిపారు.

ఐఎంపీఎస్‌ సర్వీసులంటే మొబైల్‌ ఫోన్లు లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా వెనువెంటనే నగదును బెనిఫిషియరీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు. ఈ సర్వీసులు సెలవు రోజులతో సహా 24×7 అందుబాటులో ఉంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -