Thursday, April 18, 2024
- Advertisement -

ఏపీకి కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కొత్త బాస్‌….ఎవ‌రంటె..?

- Advertisement -

చంద్రబాబు పాలనలో అత్యంత వివాదాస్పదమైన ఇంటెలిజెన్స్‌ బాస్‌ పోస్టుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టనున్న తరుణంలో పోటీ పెరిగింది. మొత్తం పోలీస్‌ వ్యవస్థకే దిశానిర్దేశం చేయాల్సిన డీజీపీ నుంచి కొన్ని సబ్‌ డివిజన్‌లలోని డీఎస్పీల వరకు రాజకీయ ఉచ్చులో పడిపోవడంతో అపఖ్యాతిపాలయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన కొందరు పోలీసులు వ్యవహరించిన తీరు అనేక విమర్శలకు తావిచ్చింది.

అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా జ‌గ‌న్ నేతృత్వంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నె పోలీసు శాఖ‌ను ప్ర‌క్షాల‌న చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వెంట‌నె ఇంటెలిజెన్సీ ఛీప్ బాస్ ఎవ‌ర‌నేదానిపై దృష్టి పెట్ట‌నున్నారు. ఇప్ప‌టికే అధికారుల బ‌దిలీలు చ‌కచ‌కా జ‌రిగిపోతున్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా డేరింగ్ అండ్ డైన‌మిక్ అధికారి రాబోతున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌నో వెరో కాదు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేసిన స్టీఫెన్ రవీంద్రే తన వద్దా పని చేయాలని జగన్ కోరుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత స్టీఫెన్ రవీంద్ర తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయన తెలంగాణలో ఐజీగా పనిచేస్తున్నారు.

1990 బ్యాచ్‌కు చెందిన రవీంద్ర… సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇంఛార్జ్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర వ్యవహరించారు.

కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన వెంట‌నే స్టీఫెన్ ను ఏపీకి తీసుకోవాలని భావిస్తున్న జగన్, ఆయన్ను డిప్యుటేషన్ మీద తమ రాష్ట్రానికి పంపించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖకు ఆయన ప్రత్యేకంగా విన్నవించారు. అందుకు హోమ్ శాఖ సానుకూలంగా స్పందించిందని, ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గానూ ఆయన పేరు దాదాపు ఖరారైందని, ఒకటి, రెండు రోజుల్లోనే ఆయన విజయవాడకు వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తారని తెలుస్తోంది.సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే చీఫ్ సెక్యూరిటీ అధికారి బాధ్యతలను స్టీఫెన్ రవీంద్ర చేపట్టవచ్చని సమాచారం. రెండు నెలల కిందటే ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా కుమార్‌ విశ్వజిత్‌ నియమితులయ్యారు. విశ్వజిత్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -