బడ్జెట్ లో అమరావతికి షాక్.. రాజధాని మార్పేనా?

857
Shock to Amaravathi in Budget 2019
Shock to Amaravathi in Budget 2019

ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ 2.27 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో 1778.52 కోట్ల రూపాయల ఆదాయ లోటును బడ్జెట్ లో ప్రస్తావించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆదాయ వ్యయం 20.10శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

అయితే రైతులకు, పరిశ్రమలు, వ్యవసాయానికి అన్ని రంగాలకు బడ్జెట్ లో భారీగా ప్రాధాన్యం, నిధులు ఇచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని మాత్రం పూర్తిగా విస్మరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అమరావతికి వేల కోట్లు అవసరం అయితే కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ మొత్తం కేవలం రైతులకు గ్రాట్యుటీ మరియు వ్యవసాయ కూలీలకు నెలవారీ పెన్షన్ చెల్లించడానికే సరిపోతుంది. ఇది రాజధాని అమరావతిని జగన్ సర్కారు విస్మరిస్తుందడానికి బలం చేకూరుతోంది.

జగన్ అధికారంలోకి రాగానే అన్ని ప్రాజెక్టులను, అమరావతి నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయించింది. ఇక ఎన్నికల మేనిఫెస్టో కూడా వైసీపీ రాజధాని గురించి ఎటువంటి హామీ ఇవ్వకపోవడం విశేషం.

అయితే వైఎస్ జగన్ అమరావతికి బదులుగా భూములు బాగా ఉన్న దోనకొండను రాజధానిగా చేయడానికి పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు బడ్జెట్ లో కూడా అమరావతికి తక్కువ కేటాయింపులు చేయడంతో రాజధాని మార్పు ఊహాగానాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి.

Loading...