Friday, March 29, 2024
- Advertisement -

సింహాచలం అప్పన్న స్వామికి తప్పని ఆర్థిక కష్టాలు..!!

- Advertisement -

దేశంలో ఆలయాల పరిస్థితి రోజు రోజు కు అధ్వాన్న స్థితి కి పోతున్నాయి.. ఆలయ నిర్వహణ కు కూడా నిధులు లేక ఆలయ నిర్వాహకులు ఆస్తులు లీజుకు ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు.. తాజాగా సింహాచలం అప్పన్న ఆస్తులు కూడా లీజుకు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. సింహాచలం అప్పన్న స్వామి ఆలయానికి అత్యంత ఖరీదైన భూములు..వాటిలో కళ్యాణ మండపాలు, భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కీలక ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం పదహారు ఎకరాల్లో ఉన్న వాటిని 11 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

ఇన్నాళ్లు ఆ సింహాచలం అప్పన్న దయవల్ల నిధులు సమకూరి ఆలయాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సకల వైభవాలు జరిపించారు కానీ ఇప్పుడు ఆ పరిష్టితి లేదు.. దాంతో వాణిజ్య పరంగా అప్పన్న స్వామి ఆస్తులు లీజుకు ఇచ్చి డబ్బు గడించాలని భావిస్తున్నారు.. వాణిజ్య పరంగా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉన్న స్థలాలు. గురువాం దేవస్థానం పాలకవర్గ సమావేశ అజెండాలో ఈ అంశాన్ని చేర్చి.. అనుమతి తీసుకోనున్నారు. భూములను లీజుకు ఇచ్చేందుకు కారణంగా.. ఆదాయం గురించి ప్రస్తావించబోతున్నట్లుగా చెబుతున్నారు. కరోనా కారణంగా ఆదాయం పడిపోయిందని… ఆలయ నిర్వహణ ఇబ్బందికరంగా మారిందన్న కారణంగా భూములు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.

సింహాచలం అప్పన్నకు విజయ నగరం పూసపాటి వంశీకులు రాసి ఇచ్చిన వేలాది ఎకరాల భూములు ఇప్పుడు వేల కోట్లలో ఉన్నాయి. వాటికి ట్రస్టీలుగా పూసపాటి వంశీయులే ఉండేవారు.. అయితే పూసపాటి వంశీకుల చేతుల నుంచి మాన్సాస్ ట్రస్ట్‌ను లాగేసుకుని..ఆనందగజపతిరాజు మాజీ భార్య కుమార్తెకు పీఠం కట్టబెట్టడంతో పరిస్థితి మారిపోయింది. దాంతో నిధుల సమకూర్చలేక అప్పన్న భూములు, ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు లీజులకు వెళ్లిపోవడం ఖాయమనే భావన ఏర్పడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -