Friday, March 29, 2024
- Advertisement -

పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగాడు.. మూడు రోజులు జైలు శిక్ష ..!

- Advertisement -

మనం ప్రతి రోజు ఎక్కడ ఒక చోట.. పొగ త్రాగటం ఆరోగ్యానికి హానికరం.. పొగ త్రాగడం మీకే కాదు.. మీ పక్కనున్న వారికీ కూడా హానీకరమే అని చూస్తూనే ఉంటాం. ప్రధానంగా సినిమాల్లో ఎక్కువగా చూస్తాం. కానీ వీటిని ఎవరు పట్టించుకోవడం లేదు.

ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లు కాల్చేస్తున్నారు. పోలీసలు దీనిపై శ్రద్ద పెట్టినప్పటికి ఇంకా చాలా మంది రోడ్లపై సిగరెట్లు తాగడం మానడం లేదు. తాజాగా రోడ్లపై సిగరెట్ తాగేవారిని.. అక్కడి స్థానికులు చూసి పోలీసులకు చెప్పడంతో.. అతడ్ని పోలీసులు కోర్టులో హాజరు పరచగా.. అతనికి ఊహించని శిక్ష వేసింది కోర్టు. ఆ శిక్ష ఏంటంటే.. పబ్లిక్ ప్లేసుల్లో మద్యపానం, ధూమపానం అనేది నిశేధం. ఈ విషయం తెలిసినప్పటికి కూడా మేడిపల్లి ఎన్‍ఐఎన్ కాలనీకి చెందిన బాలదీపక్ బుధవారం పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగాడు.

దాంతో ఆ కాలినీ వాసులు పెట్రోలింగ్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. దాంతో ఆ వ్యక్తిని పోలీసులు ఆరెస్ట్ చేసి.. ఎల్ బీ నగర్ ఫస్ట్ క్లాస్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగినందుకు ఆ వ్యక్తికి కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించింది. అయితే గతంలో ఇలా పబ్లిక్ ప్లేసుల్లో దూమపానం చేస్తే వారికి రూ.50 చొప్పున ఫైన్ కోర్టు వేసింది. కానీ ఈ సారి ఏకంగా మూడు రోజుల జైలు శిక్షని విధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -