Saturday, April 20, 2024
- Advertisement -

ఇలా మాట్లాడితే కష్టమే పవన్

- Advertisement -

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఇది విజయవంతమైందని జనసేన పార్టీ కూడా ప్రకటించుకుంది. అయితే ఇప్పటికీ పవన్ ను ఒక ప్రముఖ నటుడిగానే చూసేందుకు జనం వచ్చారు కానీ ఆయనను రాజకీయ నాయకుడిగా కాదన్న సంగతి మొన్నటి ఎన్నికలే నిరూపించాయి.

పవన్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి రాజకీయాల్లో విఫలమయ్యాడు. పోటీచేసిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటమి చవిచూశాడు. అయినప్పటికీ జనసేన చీఫ్ తనను తాను అనుభవజ్ఞుడైన అపార అనుభవం గల రాజకీయ నాయకుడిగా ఊహిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు పవన్ ఎంతో హోంవర్క్ చేయాల్సి ఉంది. ఇప్పుడు పవన్ నోటి నుంచి వచ్చిన విమర్శలకు ప్రత్యర్థులు వేస్తున్న కౌంటర్లతో పవనే అభాసుపాలు అవుతున్నాడు. అతడి సగం జ్ఞానం ప్రసంగాల్లోనే బయటపడుతోంది.

ఇక జగన్ హైకోర్టును పులివెందులలో ఏర్పాటు చేసుకుంటాడని.. అక్కడే విచారణకు హాజరవుతాడని పవన్ హాట్ కామెంట్ చేశారు. కనీస పరిజ్ఞానం లేకుండా పవన్ చేసిన ఈ వ్యాఖ్య అభాసుపాలైంది. జగన్ సీబీఐ కేసుల విచారణ హైదరాబాద్ లోని నాంపల్లి ప్రత్యేక కోర్టుల్లో సాగుతోంది. ఆంధ్రాలో హైకోర్టు మారినా జగన్ హైదరాబాద్ వెళ్లి విచారణను ఎదుర్కోవాల్సిందే.. ప్రతీవారం హాజరుకావాలని ఇటీవలే ట్రయల్ కోర్టు తెలిపింది.

జగన్ కోర్టుకు హాజరయ్యేందుకు పులివెందులలో హైకోర్టు ఏర్పాటు చేసుకుంటాడని పవన్ చేసిన వ్యాఖ్యపై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. కనీస పరిజ్ఞానం లేకుండా పవన్ మాట్లాడుతూ తన పరువును తానే తీసుకుంటున్నాడని వైసీపీ శ్రేణులు ధ్వజమెత్తుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -