Friday, April 26, 2024
- Advertisement -

రాజధానిలో ఫేస్ బుక్ రైతులు !!

- Advertisement -

రైతులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు అందరూ కలిసి రాజధానిని అమరావతి నుంచి మార్చవద్దని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ’రాజధానిలో ఫేస్ బుక్ రైతుల’ అంటు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇ వార్తలో నిజమెంత తెలియదు కానీ… ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది… అదేంటంటే..?

ఒకప్పుడు వీళ్ళవి రైతు కుటుంబాలే. కాకపోతే రాజధాని ప్రకటించాక వ్యవహారం మొత్తం మారిపోయింది. మందడం గ్రామానికి చెందిన రమేష్ బాబు బెజవాడ ( ఇప్పుడు ధర్నాలు జరుగుతున్న ఊరు ) జీవనశైలి ఎలా మారిపోయిందో చూడండి. అసైన్డ్ ల్యాండ్స్ ఎకరం లక్ష, రెండు లక్షలకి పేదల దగ్గర కొని ఆ తరువాత కోట్లకి అమ్ముకున్నాడు. ఇతను అసైన్డ్ ల్యాండ్స్ మీదే 55 కోట్లు సంపాదించాడు.

ఆ పక్కనే సుప్రియ బెజవాడ అనే ప్రొఫైల్ పెట్టాను చూడండి. ఆమె ఎవరో పెద్ద బిజినెస్ మాగ్నెట్ అనుకొన్నారు… కాదండీ బాబు ఆమె.. పైన చెప్పిన మన రమేష్ బాబు గారి భార్య. మెడలో కనీసం కోటి రూపాయల ఖరీదు చేసే నెక్లెస్ లేకపోతే నామోషీగా ఫీల్ అవుద్ది మేడమ్.

అన్నట్లు మొన్ననే ఈ ఆదర్శ రైతు దంపతులిద్దరూ వాళ్ళ కూతురు ఓణీల ఫంక్షన్ చేసారు. ఖర్చు అక్షరాలా 3 కోట్లు. మీరు మరీ అమాయకంగా బెంజి కార్లు ఉన్నాయా, ఆపిల్ ఫోన్లు ఉన్నాయా లాంటి చచ్చు ప్రశ్నలు అడగకండి. అవన్నీ అక్కడ ప్రతి ఇంట్లో ఉండే సాధారణ వస్తువులు.

ఆటవిడుపు కోసం సుప్రియ అక్క ఫ్రెండ్స్ ని వేసుకొని ధర్నా దగ్గరకి వస్తే.. అక్కడ పోలీసులు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని వాళ్ళ అంతు చూస్తామని వార్నింగ్లు ఇచ్చింది. మినరల్ వాటర్ లేదంట, ఫేస్ బుక్ లైవ్ పెడదామంటే సిగ్నల్ లేదంట, అందుకే అక్కాయ్ కి చిరాకేసి పోలీసుల మీద విరుచుకుపడింది.

నిన్న చంద్రబాబు మహిళా రైతులమీద పోలీసలు కేసులు పెట్టటం దారుణమని మీడియాలో దంచుతున్నాడు కదా.. ఆ నలుగురు మహిళా రైతులు మన అక్కాయ్ సుప్రియ ఫ్రెండ్స్ అందరూ బెంజి కారులో వచ్చినవారే……….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -