Wednesday, April 24, 2024
- Advertisement -

సూట్ కేసులో శవ‌మైతేలిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్…

- Advertisement -

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళా సాప్ట్ వేర్ ఇంజినీర్ లాణ్య దారుణ హత్యు కు గురయ్యింది. ఈ సంఘటన నగరలో కలకలం రేపుతోంది. ఆమెను గుర్తుతెలయిని వ్యక్తుల హత్య చేసి డెడ్ బాడీని సూట్‌కేస్‌ బ్యాగులో ప్యాక్‌ చేసి.. సూరారం కాలువలో పడేశారు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తలపించిన ఆ దృశ్యం వెనక పెద్ద కథే ఉండి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

వివరాల్లోకి వెల్తే…రెండ్రోజుల కిందట… సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లావణ్య కనిపించకుండా పోయింది. రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో తల్లి దండ్రులు బంధువులకు , ఆఫీస్ లో కొలీగ్స్ అందరికి ఫోన్ చేసినా అందరిది ఒకే మాట. తమ దగ్గరకు రాలేదని. వెతుకుతున్న సమయంలో తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్. హైదరాబాద్… శివార్లలోని సూరారంలో శమై కనిపించింది లావణ్య.

సూరారం దగ్గర ఏదో ఎలక చచ్చిన వాసన వస్తుంటే… అటుగా వెళ్తున్న ప్రజల దృష్టి… అక్కడున్న కాలువవైపు పడింది. ఆ కాలువ దగ్గర ఏదో ట్రావెల్ బ్యాగ్ మెరుస్తూ కనిపించింది. చెత్త ఏరుకునే ఓ వ్యక్తి… ఆ బ్యాగ్ భలే ఉంది… తనకు బాగా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. దాన్ని ఓపెన్ చేసి చూస్తె బ్యాగ్ లో రక్తపు మరకలతో ఓ యువతి డెడ్ బాడీ అందులో కనిపించింది. సీన్ కట్ చేస్తే వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు …బ్యాగుతో సహా డెడ్ బాడీని తీసుకుపోయారు. ఎంక్వైరీలో అది రెండ్రోజుల కిందట మిస్సింగ్ అయిన లావణ్యది అని తెలిసింది.

అది ఒక్కరు చేసిన హత్య కాదనీ… ఇద్దరు ముగ్గురు కలిపి చేసి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. హత్య వెనక ప్రేమ వ్యవహారం ఏదో ఉండి ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -