Wednesday, April 24, 2024
- Advertisement -

అసెంబ్లీనుంచి మ‌రో సారి న‌లుగురు టీడీపీ స‌భ్యులు స‌స్పెన్ష్‌న్‌..

- Advertisement -

అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా మ‌రో సారి న‌లుగురు శాస‌న సభ్యుల‌మీద వేటు ప‌డింది. ఇప్పటికే ముగ్గురు సభ్యులను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసిన స్పీకర్.. తాజాగా మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు అశోక్ బెందాళం, గణేశ్, రామకృష్ణ, వీరాంజనేయులును సభ నుంచి ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

బుధవారం సభలో తెలుగు రాష్ట్రాల మధ్య నీట పంపకాలపై వాడీవేడి చర్చ జరిగింది. ప్ర‌ధానంగా గోదావ‌రి జ‌లాల‌ను వినియోగంపైనె చ‌ర్చ కొన‌సాగింది. అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారని టీడీపీ ఆరోపిస్తే.. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంటే అధికారంలో ఉంది టీడీపీ కాదా అంటూ వైసీపీ కౌంటరిచ్చింది. ఇదే అంశంపై జ‌గ‌న్ క్లారిటీ ఇస్తుండ‌గా టీడీపీ స‌భ్యులు అడ్డుత‌గ‌ల‌డంతో స‌భ‌లో గంద‌ర‌గోలం ఏర్ప‌డింది.

త‌న నేత‌కు కూడా మాట్లాడేదానికి అవ‌కాశం ఇవ్వాల‌ని టీడీపీ స‌భ్యులు ప‌ట్టి బ‌ట్టినా స్పీక‌ర్ తిరస్క‌రించారు. దీంతో స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు వెల్లి నిర‌స‌న తెలిపారు. స్పీక‌ర్ ఎంత చెప్పినా వినిపించుకోక‌పోవ‌డంతో సనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన నలుగురు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలని కోరగా.. స్పీకర్ సస్పెండ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -