Tuesday, April 23, 2024
- Advertisement -

మోడీ, వర్షాలు.. అంతులేని వ్యథ..

- Advertisement -

మోడీ, వర్షాలు ఇదో అంతులేని వ్యథగానే మిగిలిపోయింది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న రోజుల్లో 2002 నుంచి 2004 వరకు భయంకరమైన కరువు తెలుగు రాష్ట్రాన్ని కుదిపేసింది. వందలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లో ఆందోళన చేసిన వారిని చంద్రబాబు ప్రభుత్వం కాల్చిపారేసింది. ఆ దెబ్బకు 10 ఏళ్లు బాబు అధికారంలోకి రాలేదు..

కాగా 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక విస్తారంగా వర్షాలు కురిశాయి. వరుణ దేవుడు వైఎస్ ను కరుణించాడు. ఆ నాలుగేళ్లు మంచి వానలు పడి కరువుపోయి రైతులు, వైఎస్ సంతోషంగా గడిపారు.

అయితే వర్షాలకు, నేతలకు సంబంధం ఉంటుందని నిరూపితమైంది. ఇక చంద్రబాబు విభాజిత ఏపీకి సీఎం అయ్యాక కూడా మంచి వానలు పడలేదు. ఆడపాదడపా కురవడమే తప్ప కడుపునిండా కాలం అయ్యింది లేదు..

తాజాగా ఈ విశ్లేషణలు కేంద్రంలోనూ సాగుతున్నాయి. 2014లో మోడీ అఖండ మెజార్టీతో గద్దెనెక్కిన తొలి సంవత్సరం దేశంలో అంతంత మాత్రంగానే వర్షాలు పడ్డాయి. మరుసటి ఏడాది 2015లోనూ దేశవ్యాప్తంగా వర్షాలు సరిగ్గా పడలేదు. వందేళ్లలో ఇలా వరుసగా రెండేళ్లు కరువు రావడం దేశమంతా అదే తొలిసారి అట..

ఇక రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 2019 సంవత్సరంలో కూడా వానలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ చెబుతోంది. మే 30 నుంచి జూన్ 6 మధ్యన దేశంలో వర్షపాత లేమి 40శాతం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో నరేంద్రమోడీ వస్తే వరుణుడు రాడా.? దేశంలో వర్షాలు పడవా అన్న సూచనలు బలపడుతున్నాయి. ఈ ఏడు..వచ్చే ఏడాది కూడా వానలు పడవు అని అంటున్నారు.. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -