Saturday, April 20, 2024
- Advertisement -

కోతల తెలంగాణ.. ఫుల్ కరెంటేదీ కేసీఆర్..

- Advertisement -

తెలంగాణ.. ఇప్పుడు కోతల తెలంగాణగా మారింది. ప్రతీ పల్లెలో, పట్టణంలో విద్యుత్ మరమ్మతుల పేరుతో రోజంతా విద్యుత్ అధికారులు కరెంట్ తీస్తున్నారు. దీనివల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటున్నారు. వ్యాపారాలను మూసుకుంటున్నారు. ఇక సాగుకు కూడా కరెంట్ లేక కీలకమైన సమయంలో రైతులు కష్టాలు పడుతున్నారు.

తెలంగాణలో పేరుకే 24 గంటల కరెంట్ అని చెబుతున్నా ఎక్కడా అమలు అవుతున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. పట్టణాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చెట్లు కొట్టడం.. విద్యుత్ కేంద్రాల్లో మరమ్మతులు, కొత్త విద్యుత్ లైన్లు అంటూ పేపర్లలో తరచుగా ప్రకటనలు ఇస్తూ గంటల కొద్దీ విద్యుత్ ను రోజంతా తీసివేస్తున్నారు. ఖరీఫ్ మొదలైనప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతోంది.

నిజానికి ఇలా విద్యుత్ సమస్యలు ఇప్పుడు ఎక్కడా లేవు. కానీ వ్యవసాయానికి విద్యుత్ కొరత నేపథ్యంలోనే ఇలా అధికారులు విద్యుత్ మరమ్మతుల పేరిట కరెంట్ తొలగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మర్మమతులు రెండు మూడు రోజులుంటాయి. కానీ నెలలో సగం రోజులు మరమ్మతుల పేరిట కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఆదిలాబాద్ సమా చిన్న మధ్య తరగతి పట్టణాల్లో కరెంట్ ను పొద్దంతా తీసివేస్తున్నారు.

ఖరీఫ్ సీజన్ మొదలు కావడం.. వర్షాలు పడడం.. సాగు మూలంగా విద్యుత్ వాడకం పెరిగింది. 24 గంటల కరెంట్ అన్న కేసీఆర్ ఇప్పుడు పట్టణాలకు కోత విధించి వ్యవసాయానికి కరెంట్ ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి 24గంటలన్న కేసీఆర్ ఇలా ఇష్టానుసారం కరెంట్ తీసేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -