Friday, April 26, 2024
- Advertisement -

ల‌గ‌డ‌పాటి స‌ర్వే వెనుక అంత క‌థుందా…..!

- Advertisement -

ఎలాంటి ఎన్నికలు జరిగినా తన సర్వేలతో వార్తల్లో నిలిచే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లోనూ సంచలనంగా నిలిచారు. జాతీయ స‌ర్వేల‌న్నీ కేసీఆర్‌కు అనుకూలంగా స‌ర్వే ఫ‌లితాల‌ను విడుద‌ళ చేస్తే ల‌గ‌డ‌పాటి మాత్రం అందుకు విరుద్ధ‌గా 65 నుంచి70 సీట్ల‌తో కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని ఉత్కంఠ‌కు తెర‌లేపారు. అయితే ల‌గ‌డ‌పాటి స‌ర్వేపై బెట్టింగ్‌లు జోరుగా సాగాయి.

తీరా ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే ఆక్టోప‌స్ ఫ‌లితాలు తారుమార‌య్యాయి. ప్ర‌జాకూట‌మి ఓడిపోవ‌డంతో ల‌గ‌డ‌పాటిని న‌మ్మి కోట్ల‌లో బెట్టింగ్ పెట్టిన బెట్టింగ్ రాయుళ్లు మునిగిపోయారు. స‌ర్వే రాజు కొట్టిన దెబ్బ‌కు అజ్ఞాతంలోకి వెల్లార‌నడంలో సందేహంలేదు.

తెలంగాణ ఎన్నికలపై తెలుగురాష్ట్రాల్లో భారీ స్థాయిలో బెట్టింగ్ జరిగింది. నిజానికి తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ హడావిడి ఎక్కువగా కనిపించింది. ప్రచారం మొదలైనప్పుడు పందాలు అంతగా లేవు.. అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వేలను నమ్ముకుని ఆ తర్వాత మరికొందరు బెట్టింగ్‌లోకి దిగారు. బెట్టింగ్ కూడా ల‌గ‌డ‌పాటి చెప్పిన స‌ర్వే కావ‌డంతో కోట్ల‌లో పందేలు కాశారు.

ప్రధానంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వేను గుడ్డిగా నమ్మిన కొందరు ప్రజాకూటమిపై కోట్లలో పందాలు కాశారు. తుది ఫలితాల్లో కూటమి నేతలు చిత్తుగా ఓడిపోయి టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో కోట్లలో పందాలు కాసిన వారు నిండా మునిగిపోయారు.

అన్నంటిలోకి కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినీ విజయంపైనే ఎక్కువ శాతం బెట్టింగ్ జరిగిందని తెలుస్తోంది. ప్రజాకూటమి విజయం సాధిస్తుందని.. ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన ఓ వ్యక్తి 5 ఎకరాలు పందెం కాశాడు. అయితే ల‌గ‌డ‌పాటి స‌ర్వే వెనుక ఆయ స్వార్థం కోసం ఉప‌యోగించుకున్న‌బెట్టింగ్ స్కామ్ అనే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

రాష్ట్ర విబ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోవ‌డంతో ల‌గ‌డ‌పాటి తీవ్ర క‌ష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.ఏపీ, తెలంగాణాలోనూ విద్యుత్‌కు కొర‌త లేక‌పోడంతో ల‌గ‌డ‌పాటి విద్యుత్ కొన‌డాన‌కి ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదు. దీంతో అప్పులు పెరిగిపోయాయి. ఇలాంటి స‌మ‌యంలో ఆయ‌న సేఫ్ గేమ్ ఆడార‌నే అర్థం అవుతోంది.

మహాకూటమి వైపు సర్వే ఎందుకు అనుకూలంగా చెప్పాల్సి వచ్చిందింటే క్షేత్రస్థాయిలో మహాకూటమిని స్వాగతించటంలేదనే వాస్తవం గ్రహించిన లగడపాటి కాంగ్రెస్ పార్టీ కోసమో లేక కమ్మ కులం కోసమో లేక రెంటి కోసమో గణనీయంగా వున్న సెటిలర్స్ ని ప్రభావితం చేయాలని ఈ అవాస్తవ సర్వే వ్యూహం రచించార‌ని తెలుస్తోంది.

గెలిచే పార్టీ వైపుకి మొగ్గే ఓటర్ల శాతం గణనీయంగా వుంటుంది. వారిని టార్గెట్ ప్రభావితం చేయదరచి వదిలిన ఎర లగడపాటి సర్వే. తెలంగాణలో హంగ్ వచ్చినా ఏపీలో కాంగ్రెస్-టీడీపీ కూటమిని సీమాంధ్రు ప్రజలు ఆమోదించే అశకాశం వుంటుంది. ఈయన చేసిన ప్రయత్నం ఫలించి సెటిలర్స్ మహాకూటమి వైపుకి మొగ్గు చూపి వారు అధికారంలోకి వస్తే ఆయన విద్యుత్తు కొనుగోలు కొనసాగుతుంది దానికి అదనంగా కాంగ్రెస్ పరంగా ఐనా కమ్మ పరంగా ఐనా లభించే తాయిలాలు వుండనే వుంటాయి.

తీవ్రమైన డబ్బు కొరతలో లగడపాటి తెలంగాణ ఎన్నికల మాటున డబ్బు గడించేందుకు పధకం పన్ని బహు చక్కగా అమలు చేసి కోట్లు గ‌డించారు. ఎన్నికల సమయంలో కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. లగడపాటి సర్వేకి విశ్వసనీయత వున్నది. సరిగ్గా దీనినే ఎరగా వేసి పూర్తిగా క్యాష్ చేసుకున్నాడు లగడపాటి. బెట్టింగ్ రాయుళ్ళకి మహాకూటమి గెలుపొందుతుందని భారీగా అంచనాలు పెంచేశారు. ఆయన స్వయానా టీఆరెస్ మీద పందెం కాస్తూ ఇతరులు మహాకూటమి వైపు పందెం కాసేలా ఆయన సర్వే నివేదిక రూపొందించారు. ఆయన టీయారెస్ గెలుపు పై పందెం కాస్తూ ఆశలు లేని మహాకూటమి వైపున పందెం కాసేలా జనాలని ప్రేరేపించారు.

ఈ బెట్టింగ్ లో లగడపాటి 1000-2000 కోట్లు సొమ్ము చేసుకున్నారని అంచనా. నేను రాజకీయాలలో లేను అని పదేపదే చెప్పే లగడపాటి గారు డబ్బు సంపాయంచాలంటే రాజకీయాలలో ఉండవలసిన అవసరం లేదపి రుజువు చేశారు. అయితే ఆయ‌ను న‌మ్మి కోట్లు బెట్టింగ్ పెట్టిన వాళ్లు మాత్రం మునిగిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -