సుగాలి ప్రీతి కేసులో జగన్ సంచలనం.

945
Sugali Preethi Case handover to CBI
Sugali Preethi Case handover to CBI

అది 2017 ఆగస్టు 19వ తేదీన కర్నూలులోని లక్ష్మీగార్డెన్.. ఈ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థిని సుగాలి ప్రీతి ఫ్యాన్ కు ఉరివేసుకొని నిర్జీవంగా కనిపించింది. ఆత్మహత్య అని కొందరు కొట్టిపారేయగా.. హత్యాచారం చేసి చంపారంటూ బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే మూడేళ్లు అయినా ఈ కేసు తేలలేదు.. అతీగతీ లేదు.. కారణం ఏంటంటే విద్యార్థిని చనిపోయిన పాఠశాల తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడిదేననే ఆరోపణలున్నాయి. దీంతో నాడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వమే ఈ కేసును నీరుగార్చారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.

కర్నూలులోని లక్ష్మీగార్డెన్ లో నివాసం ఉండే రాజు నాయక్-పార్వతి దంపతుల కుమార్తె దిన్నెదేవరపాడు సమీపంలో ఓ టీడీపీ నేతదిగా చెబుతున్న రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యనభ్యసిస్తోంది. మూడు సంవత్సర క్రితం ఈ గిరిజన బిడ్డ అనుమానాస్పద స్థితిలో పాఠశాలలో శవమై కనిపించింది. అత్యాచారం చేసి చంపించారని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు ఇప్పటికీ తేలలేదు. టీడీపీ జిల్లా నాయకుడి పాఠశాల కావడంతోనే కేసును నీరుగార్చారన్న ఆరోపణలు వచ్చాయి.

కాగా సుగాలి ప్రీతి తల్లిదండ్రుల ఆవేదన విన్న పవన్ కళ్యాణ్ విద్యార్థిని చనిపోయి మూడేళ్లు కావస్తున్నా కనీస న్యాయం కూడా జరగలేకపోవడంపై పోరుబాట పట్టారు. బాలిక తల్లిదండ్రులకు మద్దతు తెలిపి ఈ కేసులో సత్వర న్యాయం కోసం పవన్ కళ్యాణ్ బుధవారం ర్యాలీ చేయాలని నిర్ణయించారు. అందుకు ఏర్పాట్లు చేశారు.

అయితే పవన్ ర్యాలీకి ఒక్కరోజు ముందు ఈ కేసుపై కర్నూలు జిల్లా ఎస్పీ సంచలన ప్రకటన చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించామని.. పవన్ ర్యాలీ ఇక అవసరం లేదని ప్రకటనలో తెలిపారు.

టీడీపీ నాయకుడి స్కూల్లో జరిగిన ఈ దారుణంపై ఎట్టకేలకు జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకొని కేసును సీబీఐకి అప్పగించింది.

Loading...