Saturday, April 20, 2024
- Advertisement -

జూన్ 21న సూర్య గ్రహణం.. ఈ పనులు అసలు చేయొద్దు..!

- Advertisement -

ఆదివారం(జూన్ 21న) రోజు సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం ఉదయం 10.25 నిమిషాల నుండి మధ్యాహ్నం 1.54 గంటల వరకూ ఉంటుంది. ఈ సందర్భంగా జ్యోతిష పండితులు కొన్ని విషయాలు వెల్లడించారు. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకుంటేనే మంచిదని చెబుతున్నారు.

ఇక అలానే ఈ గ్రహణంను వృషభ, మిధున రాశుల వారు చూడకుండా ఉండాలని సూచిస్తున్నారు. జన్మ నక్షత్రాల పరంగా మృగశిర, ఆరుధ్ర, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈ గ్రహణం కీడును కలిగించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఇక ఈ గ్రహణం సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాలు మూతబడనున్నాయి.

బాసర సరస్వతీ దేవాలయం, శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకూ మూతబడనుంది. అలానే ఈ సూర్య గ్రహణం సమయంలో విజయవాడ, తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట తదితర పుణ్యక్షేత్రాల్లోని ఆలయాలను కూడా మూసివేయనున్నారు. ఇక ఇదే సమయంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మాత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరగనున్నాయి.

దేశానికి మేఘా రక్షణ కవచం

అచ్చెం నాయుడు ఆరోగ్యంపై జగన్ సంచలన నిర్ణయం..?

ప్రేమికులకు గుడ్ న్యూస్ : రూ.2.50 లక్షల నజరానా..!

మేఘా కృషికి పచ్చబడ్డ తెలంగాణ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -