Tuesday, April 16, 2024
- Advertisement -

సన్నీ వల్ల గరుడవేగకి.. ఎన్ని లాభాలు వచ్చాయో తెలుసా..?

- Advertisement -

గరుడ వేగ మూవీ తో చాలా కాలం తరవాత హిట్ అందుకున్నాడు హీరో రాజశేఖర్. డిఫరెంట్ కథతో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుంటుంది. ఇందులో సన్నీ ఓ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ కుర్రకారును థియేటర్లకు రప్పించేలా చేస్తుంది. అయితే కొందరు విశ్లేషకులు స్టోరీ వేగానికి, ఆమె సాంగ్ అడ్డు పడిందని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా మార్కెట్ కు మాత్రం సన్నీ ప్లస్ అవుతోందట. ఇందులో సన్నీ నటించింది అనే రీజన్ తో.. కొంతమంది ఇతర భాషల వాళ్లు ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ మీద ఆసక్తిని చూపుతున్నారని తెలుస్తోంది.

ఈ సినిమా స్టైలిష్ గా ఉండటంతో పాటు, సన్నీ డ్యాన్స్ తోడవడంతో.. డబ్బింగ్ రైట్స్ ను కొనడానికి ముందుకు వస్తున్న వాళ్ళు ఉన్నారట. ఇక ఈ సినిమాను తమిళంలోకో, మలయాళంలోకో డబ్ చేసుకుని.. సన్నీలియోన్ నటించిందని చెప్పి మార్కెట్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారట. అందుకే గరుడవేగ డబ్బిగ్ రైట్స్ కు మరింత డిమాండ్ పెరిగిందని అంటున్నారు. ఇక హిందీలో సన్నీకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే ఉంది కాబట్టి, గరుడవేగను హిందీలోకి డబ్ చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. మొత్తానికి సన్నీ కారణంగా గరుడ వేగ నిర్మాతకు బాగానే గిట్టుబాటు అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -