Friday, April 19, 2024
- Advertisement -

‘అయోధ్య’ అంతిమ తీర్పు

- Advertisement -

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో 40 రోజుల పాటు రోజువారీ విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గత నెల 16న తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయోధ్య కేసుపై ఐదుగురు న్యాయమూర్తుల ఏకగ్రీవ తీర్పు.

షియా వక్ఫ్ బోర్డు స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే, నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా తిరస్కరించింది.

రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాదాంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ అన్నారు. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని చెప్పారు. గతంలో ఈ వివాదాస్పద స్థలంలో రెండు మతాలూ ప్రార్థనలు చేసేవని తెలిపారు.

ఈ కేసు దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న హిందూ భక్తుల కోసం ఉద్దేశించింది కాదని…. ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదని.. మసీదును ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని ఇప్పటికే హైకోర్టు చెప్పిందని… రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందన్నారు జస్టిస్ గొగోయ్.

అయోధ్య వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మాణానికి ముందు ఒక నిర్మాణం ఉందని…. మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదని…. వివాదాస్పద స్థలంలో మసీదులేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోందని… యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయసూత్రాల ప్రకారం నిర్ణయిస్తామని జస్టిస్ గొగోయ్ చెప్పారు.

అయోధ్యను రామ జన్మభూమిగా హిందువులు విశ్వసిస్తారని…. మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయిందని స్పష్టం చేశారు…. శుక్రవారం రోజు ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించిందని జస్టిస్ గొగోయ్ వెల్లడించారు.

అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తెలిపింది. ముస్లింలకు అయోధ్యలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశించింది.

ఈ కేసుకు అధికరణం 47 వర్తించదుని సీజేఐ గొగోయ్ స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాలు ఉన్నప్పుడే 47వ అధికరణం వర్తిస్తుందని అన్నారు. 12 ఏళ్ల తర్వాత సున్నీ వక్ఫ్ బోర్డు ఈ కేసులో వ్యాజ్యం దాఖలు చేసిందనివివరించారు. నిర్ణయానికి ముందు ఇరు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -