Saturday, April 20, 2024
- Advertisement -

అగ్నిసాక్షిగా చెబుతున్నా జ‌గ‌న్ అంటె నాకు….? స్వ‌రూపా నందేంద్ర‌స్వామి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్వరూపానందేంద్ర సరస్వతి. జ‌గ‌న్ నా ఆత్మ అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్‌లకు ఈ పీఠాధిపతి స్వరూపంద సరస్వతి ఆశీస్సులు ఉన్నాయి. శారదాపీఠం ఆశీస్సులు ఉన్న కేసీఆర్ మరోసారి తెలంగాణ సీఎం కావడం, జగన్ ఏపీలో అద్భుత విజయంతో అధికారంలోకి రావడంతో ఈ పీఠానికి రాజకీయంగానూ ప్రాధాన్యం ఏర్పడింది.

కృష్ణా నదీ తీరంలోని గణపతి స్వచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌ శర్మ (కిరణ్‌ బాలస్వామి) సన్యాసాశ్రమ దీక్ష స్వీకరించారు. ఆయనకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు.మూడురోజులపాటు జరిగిన ఈ మహోత్సవం ముగింపు కార్య‌క్ర‌మానికి ఇరు రాష్ట్రాల సీఎలు కేసీఆర్‌, వైఎస్ జ‌గ‌న్‌లు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగంగా స్వరూపంద సరస్వతి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

అగ్నిసాక్షిగా చెబుతున్నాను, నా హృదయంలో ఆత్మగా ప్రేమిస్తున్న వ్యక్తి జగన్ అంటూ ఏపీ సీఎంపై తన ఆప్యాయతానురాగాలను చాటుకున్నారు. అంతేగాకుండా, తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి కేసీఆర్ అని ఉద్ఘాటించారు. కేసీఆర్ మంచి మనసున్న వ్యక్తి అని, అంతకుమించిన మేధావి అని కొనియాడారు. ‘మహాభారతాన్ని రెండుసార్లు చదివిన వ్యక్తి మా కేసీఆర్’ అంటూ వ్యాఖ్యానించారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ తనకు ప్రాణసమానులని పేర్కొన్న శారదా పీఠాధిపతి పేర్కోన్నారు.

జ‌గ‌న్ కోసం విశాఖ శారదా పీఠం ఐదేళ్లు శ్రమించింది. శారదా పీఠం జగన్‌ అంటే ప్రాణం పెట్టింది. అక్కడ దేన్ని కదిపినా.. జగన్ గెలవాలి, రాష్ట్రానికి మంచి చేయాలని కోరుకుంది. ఇటు జగన్, అటు కేసీఆర్ 15 ఏళ్లు దిగ్విజయంగా తెలుగు రాష్ట్రాలను పాలించాలని కోరుకుంటున్నా. అంత వరకు శారదాపీఠం తపస్సు చేస్తూనే ఉంటుంది. నా తర్వాత స్వాత్మానందేంద్ర కూడా అందుకు కృషి చేస్తార’’ని స్వరూపనంద సరస్వతి తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -