Friday, April 19, 2024
- Advertisement -

కోట్లు నష్టపోయిన టీడీపీ అభ్యర్థులు.. ఈ పాపం ఎవరిదీ..?

- Advertisement -

కుంభకోణాలకు పెట్టింది పేరైన పార్టీ టీడీపీ పార్టీ.. ఆ పార్టీ అధినేత దగ్గరినుంచి చిన్న చితక లీడర్ వరకు ఆ పార్టీ లో ఉండి ఎన్ని స్కాం లు చేశారో అర్థం చేసుకోవచ్చు.. తాజాగా టీడీపీ పార్టీ లో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఇప్పుడు రాష్ట్రంలో ఓ వార్త కోడై కూస్తుంది. కీల‌క‌మైన ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాలో ఈ స్కాం జరిగినట్లు తెలుస్తుంది. అసలు జరిగిన విషయం ఏంటంటే గత ఎన్నికల సమయంలో చంద్రబాబు తన పార్టీ ని ఎలాగైన గెలిపించాలని పార్టీ తరఫునుంచి ఖర్చుపెట్టడానికి కొంత ఫండ్ ని కూడా పంపించాడు అని అందరి తెలిసిందే..

ఒక్కొక్కరికి దాదాపు 25 కోట్లు పంపాడని అప్పట్లో నాయకులూ చర్చించుకున్నారు.. ఇదే నిజమైతే మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమనుకున్నారు.. కానీ నమ్మకం పోయాక డబ్బు ఇచ్చి ఎం లాభం అనుకున్నారో ప్రజలు వైసీపీ కి అధికారం కట్టబెట్టారు. ఎన్నికల తరువాత అంతా నార్మల్ గానే వుంది కానీ టీడీపీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు లబోదిబో అంటూ చంద్రబాబు ను ఆశ్రయిస్తున్నారట.. ఎన్నికల సమయంలో అటు పార్టీ కి, ఇటు నేతలకు ఓ వ్యక్తి మధ్యవర్తిగా ఉండేవాడట..

అతను ఈ ఎమ్మెల్యే అభ్యర్థులకు చెప్పే మాట ఏంటంటే మీరు ముందు గెలుపుకోసం కృషి చేయండి.. అధిష్టానం దగ్గరినుంచి డబ్బు మేము తీసుకొస్తాం.. అని చెప్పాడట.. దాంతో ఆ అభ్యర్థులు ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చుపెట్టారు.. అయినా ఎన్నికల్లో వారు గెలవలేదు.. అన్ని అయిపోయాక సదరు వ్యక్తి ని అడిగితే అధిష్టానం నాకేం డబ్బు ఇవ్వలేదు.. మీరే వెళ్లి తేల్చుకోండి అని అంటున్నాడట.. దాంతో వారు వెళ్లి చంద్రబాబు ముందు పంచాయితీ పెడితే డబ్బు ఇచ్చేశానని చెప్పాడట.. దీంతో చంద్రబాబు ఇచ్చామంటున్న డబ్బు తమకు చేరలేదని మధ్యలో ఎవరు కొట్టేశారో తెలీట్లేదని వాపోతున్నారట.. అధిష్టానం ఇచ్చిన నిధులు ఏమ‌య్యాయ‌ని, ఎవ‌రి జేబుల్లోకి వెళ్లాయ‌ని వారు నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతానికి ఈ విష‌యం నివురుగ‌ప్పిన నిప్పులా మార‌డం గ‌మ‌నార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -