Friday, April 26, 2024
- Advertisement -

తెలంగాణ బడ్జెట్ 1.65 లక్షల కోట్లు

- Advertisement -

దేశాన్ని ఆర్థికమాంద్యం చుట్టుముట్టడం.. తెలంగాణ సర్కారు పెండింగ్ బిల్లులు అన్నీ చెల్లించకపోవడంతో తరుముకొస్తున్న విపత్తకు అనుగుణంగా తెలంగాణ సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్ లెక్కను రూపొందించింది. ఈ రోజు 11.30 గంటలకు తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడుతుంది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ ను లెక్కల మాయ చేయకుండా ఆర్థికమాంద్యంను పరిగణలోకి తీసుకొని అక్షరాల 1.65 లక్షల కోట్లకే పరిమితం చేయడం విశేషం. బడ్జెట్ కు నిన్న మంత్రివర్గం ఆమోదించింది. శాసనమండలిలో హరీష్ రావు, శాసనసభలో కేసీఆర్ ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

కేంద్రం పార్లమెంట్ లో బడ్జెట్ పెట్టడం.. తెలంగాణకు ఎన్ని నిధులు వస్తాయనే విషయంలో క్లారిటీ రావడంతో వాస్తవిక లెక్కలతోనే కేసీఆర్ బడ్జెట్ ను తక్కువగా చేసి 1.65 లక్షల కోట్లకే పెట్టడం విశేషం. అంతకుముందు 2 లక్షల కోట్ల వరకు తీసుకెళ్లినా అంత ఆదాయం రావడం లేదని గ్రహించి ఈసారి వాస్తవంగా ఎంత పెట్టవచ్చో అంతే పెట్టడం విశేషం.

కాగా తెలంగాణ ప్రాజెక్టులో ముఖ్యంగా వ్యవసాయ రంగం, సంక్షేమం, నీటి పారుదలకు పూర్తి స్థాయిలో కేటాయింపులు చేసినట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -