Thursday, March 28, 2024
- Advertisement -

సీఎం వైఎస్ జ‌గ‌న్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ…

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లిన కేసీఆర్… ఆయనతో లంచ్ భేటీ అయ్యారు. భేటీ ప‌లు అంశాల‌పై గంటన్నరపాటు చర్చించినట్టు సమాచారం. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై, రెండు రాష్ట్రాల మద్య ఉన్న నీటి వివాదాల పరిష్కారంపై, విద్యుత్ ఉద్యోగులు పంపకాలు, విద్యుత్ బిల్లుల బకాయిలపై 9,10 షెడ్యూల్స్ లోని ప్రభుత్వ రంగ సంస్థల విభజన అంశాలపై చర్చించినట్టు సంబంధిత వర్గాల ద్వారా స‌మాచారం.

ఇక అంతకు ముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్ కు జ‌గ‌న్ టీమ్‌కు ఘన స్వాగతం ప‌లికింది. ఏపీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లి కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.. అనంతరం నేరుగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకొని ఆయ‌తో భేటీ అయ్యారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -