Tuesday, April 23, 2024
- Advertisement -

ఓటుకు నోటు కేసుపై కేసీఆర్ ఆరా ..

- Advertisement -

చంద్ర‌బాబు నాయుడికి ఓటుకు నోటు క‌ష్టాలు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. ఇన్నాళ్లు మ‌రుగున ప‌డిన కేసును తెలంగాణా ప్ర‌భుత్వం మ‌రోసారి తెర‌పైకి తీసుకొచ్చింది. ఈ కేసు పురోగ‌తిపై సీఎం కేసీఆర్ రెండు గంట‌ల‌పాటు ఉన్నాతాధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

స‌మావేశంలో పోలీసు ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించి లభించిన ఆధారాలు, వాయిస్ రికార్డ్ పై ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ నివేదికపై కేసీఆర్ ఆరా తీశారు. ఈ సమావేశానికి డీజీపీ, ఏసీబీ డీజీ, న్యాయశాఖ కార్యదర్శి, కొందరు న్యాయనిపుణులు హాజరయ్యారు.

ఓటుకు నోటు కేసు రాష్ట్ర‌వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్ కోనుగోలు వ్య‌వ‌హారంలో రేవంత్ రెడ్డి, చంద్ర‌బాబు అడియో, వీడియోల‌తో స‌హా దొరికిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొంత‌కాలంగా ఈకేసు మ‌రుగున ప‌డింద‌నే వార్త‌లు బ‌లంగా వినిపించాయి. వాట‌న్నింటికీ చెక్ పెడుతూ సీఎం కేసీఆర్ కేసును స‌మీక్షించ‌డం రాజకీయంగా మళ్లీ చర్చనీయాంశం అయింది.

ఎన్డీఏ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత చంద్ర‌బాబుకు క‌ష్టాలు ఎక్కువ‌య్యాయి. రాష్ట్రంలో వైఎస్ జ‌గ‌న్ గ్రాఫ్ పెరిగిపోతుంటే బాబు గ్రాఫ్ ప‌డిపోతోంది. బాబు, లేకేష్‌మీద వ‌స్తున్న అవినీతి ఆరోప‌న‌లు కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రునంలో ఓటుకు నోటు కేసు తెర‌మీద‌కు రావ‌డంతో బాబుకు ఇబ్బందులు త‌ప్పేలా లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -