ఓటు హ‌క్కు వినియోగించుకున్న రాజ‌కీయ ప్ర‌ముఖులు..

377
Telangana Election 2018 : TRS Ministers Cost of vote in Telangana Poll
Telangana Election 2018 : TRS Ministers Cost of vote in Telangana Poll

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ ఈ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ శుక్రవారం ఉదయం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖైరతాబాద్‌ నియోకవర్గం పరిధిలోని మక్తా పోలింగ్‌ కేంద్రానికి సతీమణితో కలిసి వచ్చిన ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌరులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర మంత్రులు పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభంలోనే మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. ఈ క్రమంలో హన్మకొండ టీచర్స్‌కాలనీలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎల్లపల్లి గ్రామంలో.. మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జ్లిలా కొల్లాపూర్‌లో.. మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక పాఠశాలలో కుటుంబ సమేతంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఓటేశారు.

నిజామాబాద్ జిల్లా పోతంగల్‌లోని 177వ పోలింగ్ బూత్‌లో కవిత ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి ఆమె ఓటు వేయడం విశేషం. ఇప్పటికే మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి ఓట్లు వేశారు. మరోవైపు ఉదయం 9.30 గంటల వరకు 10.15 శాతం పోలింగ్ నమోదైంది.