Thursday, April 25, 2024
- Advertisement -

నిరుద్యోగులకు ఇది గొప్ప శుభవార్త

- Advertisement -

తెలంగాణ విద్యావ్యవస్థపై ఎన్నో ఆరోపణలున్నాయి. ఆది నుంచి విద్యాశాఖలో నిర్లక్ష్యం, అవినీతి బయటపడి కలకలం రేగింది. తెలంగాణ తొలి సర్కారులో ఎంసెట్ లీకేజీ తీరని మచ్చగా మిగిలిపోగా.. ఈ రెండో ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కేసీఆర్ సర్కారును ఇరుకునపెట్టాయి.

ఇక తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల లెక్కన. కేసీఆర్ నినాదం ఇదే.. నీళ్లు, నిధుల్లో తెలంగాణ సర్ ప్రస్ సాధించినా నియామకాల విషయంలో మాత్రం కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది.

కేసీఆర్ సర్కారు నియామకాలు వేయడం.. అందులో లూప్ హోల్స్ ఉండి అభ్యర్థులు, విపక్షాలు కోర్టుకెక్కడం సర్వసాధారణంగా మారింది. దీంతో తెలంగాణ వచ్చినా ఉద్యోగ నియామకాలు కాక నిరుద్యోగులు కేసీఆర్ సర్కారు మీద గుర్రుగా ఉన్నారు.

అయితే అన్నింట్లో వెనుకబడ్డ తెలంగాణ గురుకుల కళాశాలల నిర్వహణ.. పలితాల్లో మాత్రం అన్ని రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. గురుకులాల డైరెక్టర్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాటి రూపు రేఖలు మార్చి ఉన్నత విలువలతో నడిపిస్తున్నారు. అందుకే గురుకులాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

ఇక తాజాగా గురుకులాలపై నమ్మకంతో కేసీఆర్ సర్కారు అందులోని ఖాళీల భర్తీకి సిద్ధమైంది. తెలంగాణ నిరుద్యోగులకు సర్కారు తీపికబురునందించింది సర్కారు. తాజాగా తెలంగాణలోని బీసీ గురుకులాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించడం విశేషం. బీసీ గురుకులాల్లోని 1698 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఇందులో టీజీటీ 1071, పీఈటీ 119 పోస్టులున్నాయి. వీటితోపాటు 35 ప్రిన్సిపాల్ సహా ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -