Thursday, April 25, 2024
- Advertisement -

హైకోర్టులో సుజనా చౌదరికి చుక్కెదురు..

- Advertisement -

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించకుండా మోసం చేసారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి తెలంగాణా హైకోర్టుల చుక్కెదురైంది.బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీ కేసులో సీబీఐ నోటీసులను సవాల్‌చేస్తూ సుజనా వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సీబీఐ విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టంచేసింది. మే 27, 28 తేదీల్లో బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు జారీచేసింది.ఉదయం 10 నుంచి సాయంత్రం 5 మధ్య మాత్రమే విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది.

2017లో ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.71 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించలేదని బెంగళూరు సీబీఐ బ్రాంచ్ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆ కేసుకు సంబంధించి మే 4న బెంగళూరులోని తమ కార్యాలయం ఎదుట హాజరుకావాలని సుజనాకు సీబీఐ నోటీసులు అందజేసింది. విచార‌ణ‌కు హాజ‌ర‌యితే అరెస్ట్ చేస్తార‌న్న భ‌యంతో హైకోర్టును ఆశ్ర‌యించారు. సీబీఐ పంపిన నోటీల‌ను కొట్టి వేయాల‌ని కోర్టును కోరారు. అయితే కోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందేన‌ని తేల్చ చెప్పింది.

2017లో ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.71 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించలేదని బెంగళూరు సీబీఐ బ్రాంచ్ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఆ కేసుకు సంబంధించి మే 4న బెంగళూరులోని తమ కార్యాలయం ఎదుట హాజరుకావాలని సుజనాకు సీబీఐ నోటీసులు అందజేసిం. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -