Friday, April 19, 2024
- Advertisement -

కేటీఆర్‌కు వైట్‌హౌస్ ప్ర‌శంస‌లు

- Advertisement -

ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల భాగ‌స్వామ్య స‌ద‌స్సు (జీఈఎస్‌) హైద‌రాబాద్ గ‌డ్డ‌పై తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించింది. ఈ స‌ద‌స్సు విజ‌యవంతం చేయ‌డంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌ర్చాడు. ద‌గ్గ‌రుండి మ‌రీ స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌పై రోజుకోమారు స‌మీక్ష చేస్తూ స‌ద‌స్సు విజ‌య‌వంతం చేయ‌డంలో ముఖ్య భూమిక పోషించాడు. ఈ స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌పై అంద‌రి నుంచి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిసింది. ఈ స‌ద‌స్సుతో తెలంగాణ, ముఖ్యంగా హైద‌రాబాద్ ప్ర‌పంచ స్థాయికి ఎదిగింది.

ఈ స‌ద‌స్సు నుంచి వెళ్తున్న స‌మ‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, అమెరికా స‌ల‌హాదారు ఇవాంకా ట్రంప్ మ‌ర‌చిలేక‌పోతోంది. అమెరికాకు వెళ్లిన 15 రోజుల‌కు గుర్తుచేసుకొని త‌న చేతితో తెలంగాణ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త చెబుతూ స్వ‌యంగా లేఖ రాసింది. ఇప్పుడు అదే స‌ద‌స్సు విజ‌య‌వంతం చేసినందుకు మంత్రి కేటీఆర్‌కు వైట్‌హౌస్ అభినంద‌న‌లు తెలిపింది.

అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్ శుక్రవారం (డిసెంబర్-29) కేటీఆర్‌కు లేఖ రాశారు. లేఖలో మంత్రి కేటీఆర్‌ను ప్రశంసించారు. హైదరాబాద్‌లో జీఈ సదస్సు అద్భుతంగా నిర్వహించినందుకు అభినంద‌న‌లు తెలిపారు. జీఈ సదస్సు విజయవంతమ‌వ‌డంతో కెన్నెత్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాట్ల వల్లే సదస్సు అర్థవంతంగా సాగిందని కెన్నెత్ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కెన్నెత్ ప్ర‌శంసించారు. సాంకేతికత, ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ‌ను రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతున్నారని గుర్తించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడి విధానాలు దేశానికే ఆదర్శమని కెన్నెత్ స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -