Friday, April 19, 2024
- Advertisement -

ఆర్టీసీలో సమ్మెసైరన్….బెంబేలెత్తుతున్న ప్రయాణీకులు

- Advertisement -

దసరా పండుగ సమయంలో ఆర్టీసీలో సమ్మెసైరన్ మోగింది. ఈ రోజు అర్థరాత్రినుంచి సమ్మెలోకి వెల్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై స్పష్టత ఇవ్వాలని మరో మారు ప్రభుత్వ త్రిసభ్య కమిటీతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో శుక్రవారం అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ ప్రకటించింది.

ప్రభుత్వానికి కార్మికుల సమస్యను పరిష్కరించే ఉద్దేశం లేదని.. అధికారులు ఏం చెప్పే పరిస్థితిలో లేరన్నారు. గతంలో ప్రభుత్వం వేసిన కమిటీ ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదని.. ఆర్టీసీని బతికించడానికే తమ పోరాలమని వెల్లడించారు కార్మిక సంఘాల నాయకులు.ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా వెనక్కు తగ్గేది లేదన్నారు లేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వమే కాపాడాలని.. సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

మరోవైపు సమ్మెపై ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పందించారు. సమ్మె చట్ట విరుద్ధమని.. సమ్మెలో ఉద్యోగులు పాల్గొంటే డిస్మిస్ చేస్తామన్నారు. అవసరమైతే ఎస్మాను ప్రయోగిస్తామని తేల్చి చెప్పారు.సమ్మె వైపుగా ఆర్టీసీ కార్మికులు అడుగులు వేస్తుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రయివేటు డ్రైవర్లతో బస్సులను తిప్పాలని ఆర్టీసీ యాజమాన్యం కసరత్తులు చేస్తోంది.

మరో వైపు ప్రయాణీకులను అడ్డుగోలుగా దోచుకొనేందుకు ప్రయివేట్ ట్రావెల్స్ సిద్దమయ్యాయి. ప్రయాణికులకు గత్యంతరం లేక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ లో వెళ్లాల్సి వస్తోంది. దీంతో అడ్డగోలు ఛార్జీలతో దారి దోపిడి చేస్తున్నాయి.టికెట్‌ బుకింగ్‌ యాప్‌లోనూ ప్రయాణికులను మోసం చేస్తున్నాయి ట్రావెల్స్‌. విజయవాడ టికెట్‌ 500 రూపాయలు అని ఉంటుంది. క్లిక్‌ చేసి.. టికెట్‌ బుక్‌ చేసే టైంలో 2 వేల రూపాయలు చూపిస్తోంది. దీంతో ప్రయాణీలకుు లబోదిబో మంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -