Saturday, April 20, 2024
- Advertisement -

తమిళనాడులో ఘోర రోడ్డు ప్ర‌మాదం 10 మంది దుర్మ‌ర‌ణం….

- Advertisement -

త‌మిళ‌నాడులో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 10 మంది అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెంద‌గా ప‌లువురు గాయ‌ప‌డ్డారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా కల్లకురిచిలో గురువారం వేకువజామున 2.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. జార్ఖండ్‌కు చెందిన కార్మికులతో ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు విల్లుపురం జిల్లా కల్లాకుర్చి వద్దకు చేరుకోగానే మరో ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కల్లకుర్చి-సేలం జాతీయ రహదారిపై మూడుగంటల పాటు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

మ‌ర‌ణించిన వారిలో జార్ఖండుకు చెందిన కూలీలె అధికంగా ఉన్నారు. కాంచీపురంలోని ఉథిరమేరూర్ నుంచి మొత్తం 14 మంది కూలీలు ట్రక్కులో తిర్పూర్ జిల్లా కంజేయమ్‌కు వెళ్తుండగా అన్నా నగర్ బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది. వీరిలో 11 మంది జార్ఖండ్ వాసులు ఉన్నారు. మృతిచెందిన వారిలో మదురైకి చెందిన ట్రక్కు డ్రైవర్‌ ఎం.మణికండన్‌, తిరునైవేలికి చెందిన బస్సు డ్రైవర్‌ ఎ. రాజేంద్రన్‌ కూడా ఉన్నారు.

క్కు నుజ్జునుజ్జవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతుంది. ట్రక్కులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయడానికి చాలా సమయం పట్టింది. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -