Saturday, April 20, 2024
- Advertisement -

కారెక్కి కలవరపడుతున్నారు..!

- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పుడు శివగామి వలే ఆయన మాటే టీఆర్ఎస్ లో వేదం. సొంతు కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ లకే ఇంకా మంత్రి పదవులు ఇవ్వకుండా కేసీఆర్ జాప్యం చేస్తున్నారు. ఇక మిగతా పదవులు ఆశిస్తున్న నేతలకు మరోలా చెప్పాలా అనేలా టీఆర్ఎస్ లో పరిస్థితులున్నాయట.. ఇప్పుడు కారెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల తమ ఆశలు ఎప్పుడు తీరుతాయోనని కేసీఆర్ కరుణా కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు..

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ హోంమంత్రి సబితాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీతోనే కారెక్కించారు. కానీ ఇప్పటివరకు కేసీఆర్ విస్తరణ జోలికి పోవడం లేదు. ఆమె కుమారుడికి రంగారెడ్డి ఎంపీ టికెట్ కూడా దక్కలేదు. ఇక కారెక్కిన ఎస్టీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, వీరయ్యలు కూడా ఎస్టీ కోటా మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ను వీడిన వనమా వెంకటేశ్వరరావు , ఉపేందర్ రెడ్దిలు కూడా విప్ లేదా నామినేటడె పోస్టులు ఆశిస్తున్నారు. ఇక క్షేత్రస్థాయిలోని మార్కెట్ కమిటీ, కార్పొరేషన్ ల డైరెక్టర్ పదవులు తమ అనుయాయులకు ఇప్పించాలని వీళ్లంతా కోరుతున్నా కేసీఆర్ నుంచి మాత్రం ఎలాంటి సిగ్నల్స్ ఇప్పటివరకు రావడం లేదట..

గండ్రా వెంకటరమణ రెడ్డి ఒక్కటే టీఆర్ఎస్ లో లాభపడ్డారు. కారెక్కి ఆయన తన భార్యను భూపాలపల్లి జడ్పీచైర్ పర్సన్ ను చేసుకున్నారు. ఇలా కారు పార్టీలో చేరిన వారిలో అందరూ పదవులు ఏవీ అని కొండంత ఆశతో గులాబీ బాస్ కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ సార్ మాత్రం కొండంత జాప్యం చేస్తూ అందరిలోనూ ఓపిక నశించే స్థాయికి నాన్చుతుండడం టీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -