Thursday, April 25, 2024
- Advertisement -

మహాపురుషుడికి వరుస అవినీతి మరకలు

- Advertisement -

అయిపోయింది. ఇన్నాళ్లూ ఏ అవినీతి మరక లేని మహాపురుషుడు అని ఏ బీజేపీ అయితే మోడీని కొనియాడిందో..దేశం ఆకాశానికెత్తేసిందో..ఆ మహాపురుషుడి అవినీతి మరకలు బయటపడ్డాయి. పడుతున్నాయి. విదేశాల్లో భారత్ పరువు మంటగలిపేశారు ఆ మహా పురుషుడు అని విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. నరేంద్రమోడీ సర్కార్ ఇన్నాళ్లూ ఫెయిల్యూర్ సర్కార్ గా నిలిచిపోయింది. ఇప్పుడు కరప్షన్ సర్కార్ గా కూడా చరిత్ర కెక్కింది. మోడీ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్ధానాలు ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారు. నల్లధనం తెస్తాన్నారు తేలేదు. ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు వేయలేదు. అవినీతి అంతు చూస్తామన్నారు, అవినీతి పరులను జైలుకు పంపుతామన్నారు. పంపలేదు. నోట్ల రద్దుతో దేశం రూపురేఖలే మారిపోతాయన్నారు. కానీ సామాన్య మధ్య తరగతి, చిరుద్యోగులు, చిరువ్యాపారులు పడరాని పాట్లు పడ్డారు. ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ, ఏటీఎం చుట్టూ తిరగలేక నానా అవస్థలు పడుతున్నారు. ఎవరి డబ్బులు వారు తెచ్చుకోవడానికి తిప్పలు తప్పడం లేదు. పైగా మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో బ్యాంకులు దోపిడీ, ఎస్ఎమ్మెఎస్ అలెర్టు పేరుతో, ఏటీఎం చార్జీల పేరుతో దోపిడీ,. కానీ బీజేపీ నేతల ఇళ్లల్లోనే భారీగా కొత్త నోట్ల కట్టలు బయటపడటంతో ఇదో పెద్ద స్కామ్ అని ఆరోపణలు వచ్చాయి. ఇలా అనేక రకాలుగా ప్రజల రక్తాన్ని పీల్చేసిన మోడీ సర్కార్ ఫెయిల్యూర్ సర్కార్ గా ఇన్నాళ్లూ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కరప్షన్ సర్కార్ గా కూడా అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుంది. దేశం పరువుని విదేశాల్లో తాకట్టు పెట్టేసింది.

తాజాగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ మోడీ సర్కార్ అసలు గుట్టు రట్టుచేశారు. ఏ అనుభవం లేకపోయినా రిలయన్స్ డిఫెన్స్ సంస్థతో 40వేల కోట్ల యుద్ధ విమానాల డీల్ కుదుర్చుకోవాలని మోడీ ప్రభుత్వమే చెప్పడంతో మాకు వేరే గత్యంతరం లేక ఆ డీల్ కుదుర్చుకున్నామని హోలండ్ మీడియాతో చెప్పారు. యుద్ధ విమానాల తయారీలో ఎంతో అనుభవమున్న ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు, సత్తా, అనుభవం లేవంటూ మోడీ ప్రభుత్వం ఆ డీల్ వారికి రద్దు చేయించింది. అదంతా అబద్ధం హిందూస్థాన్ ఏరానాటిక్స్ లిమిటెడ్ సంస్థకు ఆ సామర్ధ్యం, అనుభవం పుష్కలంగా ఉన్నాయి. అని ఆ సంస్థ మాజీ చీఫ్ సువర్ణరాజు తేల్చి చెప్పారు. మోడీ ప్రభుత్వం అన్నీ అబద్ధాలు చెబుతోందని, వేరేవాళ్ల ప్రయోజనాలు కాపడటానికి హిందూస్థాన్ ఏరానాటిక్స్ లిమిటెడ్ సామర్ధ్యంపై నిందలు వేయడం సరికాదని ఆయన బాంబ్ పేల్చిన మరుసటి రోజే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ మరో బాంబ్ పేల్చారు. రిలయన్స్ డిఫెన్స్ సంస్థతోనే డీల్ కుదుర్చుకోవాలని స్వయంగా మోడీ ప్రభుత్వమే తేల్చి చెప్పాక, మాకు వేరే ఆప్షన్ లేక డీల్ కుదుర్చుకున్నామని మరో బాంబ్ పేల్చారు. ఇందుకు ప్రతిఫలంగా రిలయన్స్ ఎంటర్ టైన్స్ మెంట్ ద్వారా హోలాండ్ భార్య సహనిర్మాతగా వ్యవహించిన ఓ సినిమాకు భారీ పెట్టుబడి పెట్టింది. ఈ వివరాలన్నీ మీడియా ద్వారా బయటపడ్డాయి.

మరోవైపు ఇప్పటికే తాను దేశం విడిచి వెళ్లిన ముందు రోజు స్వయంగా ఆర్థికమంత్రి అరుణై జైట్లీని కలిసి వెళ్లానని, ఆయనకు అంతా చెప్పే వెళ్లానని ఆర్ధిక నేరాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇప్పుడు రాఫెల్ కుంభకోణం బయటపడటంతో సైనికుల ప్రాణాలతో దేశ భద్రతతో చెలగాటమాడుతున్నారు రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, తమ్మినేని సీతారాం సహా బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా మండిపడుతున్నారు. ఆరోపణలు రుజువైతే ఇవి చాలా తీవ్రమైన ఆర్ధిక నేరాలని వ్యాఖ్యానించారు. దీనికి వచ్చే ఎన్నికల్లో మోడీ పతనం ఖాయమని జోస్యం చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -