Saturday, April 20, 2024
- Advertisement -

చంద్రబాబుకి గుడ్ న్యూస్ మోడీకి బ్యాడ్ న్యూస్

- Advertisement -

నరేమంద్రమోడీ మరోసారి ప్రధాని అయ్యే అవకాశాలు లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన అధికారిక కన్జూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వేలో వెళ్లడయింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి దేశ్ ఆర్ధిక స్థితిగతులు, ప్రజల జీవనం, ఉద్యోగ కల్పన, నిరుద్యోగ సమస్య వంటి అంశాలపై ” వినియోగదారుల విశ్వాస సూచీ” పేరుతో ఆర్ బీఐ సర్వే చేయిస్తుంటుంది. ఆ సర్వే చాలా కీలకమైనది. ఈ సారి కూడా ఆర్బీఐ దేశంలోని 13 ప్రధాన నగరాల్లో కన్జూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వే చేపట్టింది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మాదాబాద్‌, భోపాల్‌, చెన్నై, గౌహతి, జైపూర్‌, లక్నో, ముంబై, కోల్‌కతా, పాట్నా, తిరువనంతపురంలో ప్రజాభిప్రాయాలను సేకరించారు. వివిధ అంశాలపై 5,364 మంది నుంచి సమాచారాన్ని సేకరించారు. వారిచ్చిన సమాచారం ప్రకారం మోడీ ప్రధాని అయ్యాక దేశ ఆర్ధిక స్థితి అల్లకల్లోలంగా మారిందని, నోట్ల రద్దు, జీఎస్టీ, సామాన్యులు, మధ్య తరగతి ప్రజల జీవన ప్రమాణాలను అతలాకుతలం చేసేశాయని తేలింది. ప్రధానంగా ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పన, విదేశాల నుంచి నల్లధనం తీసుకురావడం, అవినీతి పరులను జైలుకు పంపండం వంటి హామీల అమలులో మోడీ పూర్తిగా విఫలమయ్యారని జనం అభిప్రాయపడ్డారు. దానికి తోడు నోట్లరద్దు, జీఎస్టీతో చిరు వ్యాపారులు, గ్రామీణ పట్టణ ప్రాంత మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల వెన్ను విరిచేశారని మండిపడ్డారు. డిజిటల్ లావాదేవీలు, ఆన్ లైన్ బ్యాంకింగ్, ఏటీఎం చార్జీలు, మెసేజ్ చార్జీస్, మినిమమ్ బ్యాలెన్స్…అంటూ వివిధ రకాలా సర్వీస్ చార్జీల పేరుతో బ్యాంకులు నిలువు దోపీడికీ పాల్పడుతుంటే మోడీ ప్రభుత్వం బడాబాబులను విదేశాలకు పంపేయడం, ఆర్ధిక నేరగాళ్లకు అండగా నిలవడం, రాజకీయ అవసరాల నేపథ్యంలో అవినీతి పరులతో చేతులు కలపడం చేస్తోందని జనం సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడించారు.

నిత్యావసరాల ధరల పెరుగుదలతో నగర జీవితాలు మరింత దుర్భరమయ్యాయి. నిరుద్యోగ సమస్య విలయతాండవం చేస్తోంది. ఏ ఒక్క అవినీతి రాజకీయ నాయకుడిని జైలుకు పంపలేదు కదా, తిరిగి వారితో చెట్టపట్టాలేసుకుని మోడీ ప్రభుత్వం తిరుగుతోందన ఆర్బీఐ సర్వేలో జనం నాడి చెప్పింది. ఉద్యోగ ఉపాధి కల్పనలో పూర్తిగా విఫలం చెందారని ప్రజలు మోడీ సర్కార్ పని తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధరలను అదుపు చేయడంలో విఫలమైన సర్కార్ ప్రజల ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని పూడ్చడంలో గతి తప్పింది. ఆదాయం మూరెడు ఖర్చు బారెడు అన్నట్టు ఆర్ధికి స్థితి దిగజారిపోయింది. దీంతో అన్ని వర్గాలు మోడీ ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఆర్బీఐ రెండేళ్లకు ఓ సారి నిర్వహించే ” వినియోగదారుల విశ్వాస సూచీ” చాలా కీలకమైన సమాచారాన్ని దేశ ప్రజల మనోభావాలను వ్యక్తపరుస్తుంది. ఈ సూచీ ఆధారంగా గతంలో ప్రభుత్వాలు కుప్పకూలిన సందర్భాలూ ఉన్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ, డిజిటల్ లావాదేవీలతో విసిగివేసారిన ప్రజలకు ఇప్పుడు విజయా మాల్యా, నీరవ్ మోడీ, రాఫెల్ యుద్ధవిమానాల కుంభకోణాలు మోడీ సర్కార్ పై ఉన్న విశ్వసనీయతను దెబ్బతీశాయి. వాటి ప్రభావం వచ్చే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కచ్చితంగా బేజీపీ విజయావకాశాలను దెబ్బతీస్తాయని తెలుస్తోంది. తర్వాత జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కమలం పార్టీకి గట్టి షాక్ తప్పదని అంచనా వేస్తోంది. ఇప్పటికే పలు ఇతర సర్వేలు కూడా అదే విషయాన్ని చెబుతుండటంతో బీజేపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. మరోవైపు మోడీ మళ్లీ గద్దెనెక్కకుండా ఎలాగైనా అడ్డుకోవాలని శతవిధాలా పావులు కదుపుతూ, ఏపీకి అన్యాయం చేశారని దేశమంతా ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఆర్బీఐ కన్జూమర్‌ కాన్ఫిడెన్స్‌ సర్వే పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2019లో తమ లక్ష్యం నెరవేరబోతోందని, మోడీ ఢిల్లీ వదిలి గుజరాత్ వెళ్లే సమయం ఆసన్నమైందని టీడీపీ శ్రేణులు మరింత ఉత్సాహంతో ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -