Thursday, March 28, 2024
- Advertisement -

స‌దా మీ సేవ‌లో అంటున్న స్కౌట్‌!

- Advertisement -

న‌ట్టింట్లో కూర్చోని.. నెట్టింట్లో సెర్చ్ చేస్తూ.. కావాల్సిన‌వి ఇంటి ముంద‌కు వ‌చ్చేలా చేసుకుంటున్న రోజులివి. మొద‌ట పుస్త‌కాలు అమ్ముకునే కంపెనీగా ప్రారంభ‌మైన అమెజాన్ దీనిని క్యాష్ చేసుకుంది. ఆన్‌లైన్ స్టోర్‌ను ఓపెన్ చేసి.. మంచి క్వాలిటీ సేవ‌లందించ‌డంతో అమెజాన్ మూడు పువ్వులు.. ఆరు కాయ‌లు అన్న‌ట్టుగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించింది. ఇప్పుడు కస్ట‌మ‌ర్ల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందించేందుకు అమెజాన్ రోబోల‌ను ఉప‌యోగించేందుకు సిద్ధ‌మైంది.

వ‌స్తువుల‌ను డోర్ డెలివ‌రీ చేయ‌డానికి స్కౌట్ అనే రోబోల‌ను దీని కోసం వినియోగించ‌నుంది. దీనికి సంబంధించిన ట్ర‌య‌ల్ ర‌న్‌ను వాషింగ్టన్ లోని స్నోహోమిష్‌ కంట్రీలో నిర్వ‌హించారు. లేత నీలం రంగులో బాక్సు పరిమాణంలో ఉన్న ఈ రోబోకు 6 చక్రాలు అమర్చారు. ఇరుకువీధుల్లో, కాలిబాటలో సులభంగా తిరగగలిగేలా వీటిని రూపొందించారు. ప్రస్తుతం ఈ రోబో వెంట ఓ ఉద్యోగిని పంపుతూ దాని పనితీరును విశ్లేషిస్తున్నామని అమెజాన్ ప్ర‌క‌టించింది.

తమ చుట్టుపక్కల ఉండే మనుషులు, జంతువులను గమనిస్తూ జాగ్రత్తగా ముందుకు సాగేలా ఈ రోబ‌ను డిజైన్ చేశారు ప్రధానంగా కాలేజీలు, స్కూల్స్‌లో ఫాస్ట్ ఫుడ్ అందించడానికి ఈ రోబోను వాడే అవకాశమున్న‌ట్టు తెలుస్తుంది. కాగా, ఈ రోబోలను త్వరలోనే సియాటెల్ నగరంలో ప్రవేశపెట్టనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -