పెళ్లి లో కోతి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు..దెబ్బకు..!!

354
What do these dots under the newspaper mean
What do these dots under the newspaper mean

శుభకార్యాలకు ఎంతో మంది అతిధులు వస్తుంటారు.. పెళ్లిళ్లకు వచ్చిన అతిధులు నూతన వధూవరులు ఆశీర్వదించి వెళ్తుంటారు. అయితే తాజగా ఓ నూతన వధూవరుల పెళ్ళికి  ఒక అనుకోని అతిథి వచ్చి ఆ జంటను ఆశీర్వదించారు. ఇందులో వింతేముంది అనుకోకండి. పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే.

ములుగు జిల్లా లోని మంగపేట్ మండలం లోని మల్లూరు లో శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇటీవల ఒక పెళ్లి జరిగింది. వధూవరులు నూగురు వెంకటాపురానికి చెందినవారట. వధూవరులిద్దరూ తలంబ్రాలు పోసుకుంటున్న సమయంలో ఒక కోతి వచ్చి ఆ జంటను ఆశీర్వదించింది. సడన్ గా అలా కోతి రావడం తో అక్కడున్న వారందరికీ ఏం జరుగుతోందో అర్థం అవ్వలేదు.  పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కూడా ముందు కొంచెం భయపడ్డారు.

కానీ తర్వాత ఆ కోతి పెళ్లికూతురిని, పెళ్ళికొడుకు ని ఆశీర్వదించడం తో అందరూ సంతోషపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వచ్చి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు జంటను ఆశీర్వదించారు అని అంటున్నారు.

Loading...