Saturday, April 20, 2024
- Advertisement -

అసెంబ్లీ నుంచి ముగ్గురు స‌భ్యులు స‌స్పెండ్ …

- Advertisement -

ఏపీ శాసనసభ సమావేశాల్లో టీడీపీకీ బిగ్ షాక్ త‌గిలింది. జ‌గ‌న్ ప్ర‌సంగానికి అడ్డుత‌గులుతున్న శాసనసభాపక్ష ఉపనాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,అచ్చెన్నాయుడు,నిమ్మల రామానాయుడు ల‌ను డిప్యూటీ స్పీక‌ర్ స‌స్పెండ్ చేశారు. సస్పెన్షన్ తర్వాత మార్షల్స్ వీరిని బయటకు తీసుకొచ్చారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులపై చర్చలకు అడ్డు తగులుతున్నారన్న కారణంతో వీరిని సస్పెండ్ చేశారు. వీరు ముగ్గురినీ ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేస్తున్నామని, వీరు వెంటనే సభను వీడి వెళ్లాలని డిప్యూటీ స్పీకర్ కోన ర‌ఘుప‌తి ఆదేశించారు.

బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టగా టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కూర్చోవాలని ఎంతగా చెప్పినా వినకపోవడంతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడిని సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి ముగ్గురిని సస్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

స‌స్పెండ్ అనంత‌రం ముగ్గురు స‌భ్యులు ప్ర‌భుత్వంపై విరుచుక‌ప‌డ్డారు. తాము అనుకున్నదంతా అయిందని, కడప ఫ్యాక్షన్ అసెంబ్లీలోకి ప్రవేశించిందని ఆరోపించిన ఆయన, ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలపై తాము ఎక్కడ నిలదీస్తామోనన్న భయంతో సభ నుంచి గెంటేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -