Friday, March 29, 2024
- Advertisement -

భూమికి ముంచుకొస్తున్న పెను ప్ర‌మాదం….

- Advertisement -

మరికొన్ని వారాల్లో భూమికి పెను ప్ర‌మాదం పొంచివుంది. అంతరిక్షంలో నియంత్రణ కోల్పోయిన చైనా స్పేస్ ల్యాబ్ త్వరలోనే భూమిపై కూలిపోనుంది. భూమివైపు 8.5 టన్నుల స్పేస్ ల్యాబ్ శకలాలు.. జనావాసాలపై కూలితే ప్రాణ, ఆస్తి నష్టం భారీగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అది ఎప్పుడు, ఎక్కడ కూలనుందో అంచనా వేస్తున్నారు.

ఆసియాలోనే తొలి స్పేస్ స్టేషన్గా పేరొందిన ‘టియాంగోన్గ్-1’ను 2011లో ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో తన సత్తా చాటేందుకు చైనా ఈ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. దీనికి ‘హెవెన్లీ ప్యాలెస్’ అని పేర్కొంది. ఇందులోకి వ్యోమగాములను కూడా పంపింది. చైనాకు చెందిన తొలి మహిళా వ్యోమగామి లియు యంగ్ 2012లో ఈ స్పేస్ స్టేషన్కు విచ్చేసింది. ఇది ఏర్పాటైన కొన్నాళ్లకే తిరిగి భూమి వైపు దూసుకు రావడం మొదలైంది.

సాధారణంగా అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చే శకలాలు మధ్య దారిలోనే దహనమైపోతాయి. కొన్ని సముద్రంలో కూలిపోతాయి. దీనివల్ల మానావళికి ప్రమాదం ఉండదు. అయితే, ఇప్పుడు దూసుకొస్తున్న స్పేస్ స్టేషన్ మాత్రం నివాస ప్రాంతాలపైకి రావచ్చనే ఆందోళన నెలకొంది. పైగా, ఈ స్పేస్ స్టేషన్లో ప్రమాదకరమైన హైడ్రాజిన్ ఇంధనం ఉన్నట్లు తెలుపుతున్నారు. దీనివల్ల ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో కూలవచ్చని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు

ఈ శకలాలు భూమికి 43 డిగ్రీల ఉత్తరం లేదా 43 డిగ్రీల దక్షిణ అక్షాంశాల్లో కూలే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తర చైనా, మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఇటలీ, ఉత్తర స్పెయిన్లలో కూలేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.
అలాగే అమెరికా, న్యూజిలాండ్, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల్లో కూడా కూలేందుకు అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
అయితే, అది భూమికి దగ్గరగా వచ్చే వరకు ఏ దిశలో ప్రయాణిస్తుందనే విషయంపై స్పష్టత రాదని తెలుపుతున్నారు.
స్పేస్ స్టేషన్ శకలాలు ఏప్రిల్ మొదటి వారంలో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తాయని అమెరికా ఏరో స్పేస్ కార్పొరేషన్ తెలిపింది.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంచనా ప్రకారం.. మార్చి 24 నుంచి ఏప్రిల్ 19 లోపు ఈ శకలాలు కూలే అవ‌కాశాలు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -