Saturday, April 20, 2024
- Advertisement -

టిక్ టాక్ ఫ్యాన్స్‌కు గూగుల్ షాక్…ఇక‌నుంచి…..?

- Advertisement -

సోషల్ మీడియా సంచలనం, చైనా యాప్‌​ ‘టిక్ టాక్ యూజర్లకు, ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ఇచ్చింది గూగుల్‌. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి టిక్ టాక్ యాప్ ను తొల‌గించారు. మద్రాస్‌ హైకోర్టు బ్యాన్‌, సుప్రీం ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం చర్యల నేపథ్యంలో టిక్‌ టాక్‌ యాప్‌ను గూగుల్‌ బ్యాన్‌ చేసిందని రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది.

టిక్‌టాక్‌ డౌన్‌లోడ్లను నిషేధించాలనే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టిక్‌ టాక్‌ యాప్‌ నిషేధంపై స్టే విధించాలంటూ చైనాకు చెందిన బైటెన్స్ టెక్నాలజీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం భారతదేశంలో గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ ప్లే స్టోర్‌లో క‌నిపించ‌డంలేదు.

టిక్ టాక్… వీడియో షేరింగ్ యాప్. యువతీయువకుల్లో ఈ యాప్‌కు క్రేజ్ ఎక్కువ. సొంతగా వీడియోలు రికార్డ్ చేసి అప్‌లోడ్ చేస్తుంటారు. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఈ యాప్ ఎక్కువగా ఉపయోగిస్తుండటం విశేషం. అయితే ఇది వ్య‌స‌నంగా మారింది.దీంతో చైనాకు చెందిన వీడియో యాప్ టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలని కొద్దిరోజుల క్రితం మద్రాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

దాని క‌నుగునంగా గూగుల్, ఆపిల్ స్టోర్లలో ప్రమాదకరమైన యాప్‌ను తొలగించాలని కేంద్రాన్ని కోరింది. టిక్ టాక్, హలో యాప్‌లు దేశవ్యాప్తంగా టీనేజర్‌లు, యువతపై దుష్ర్పభావాన్ని చూపిస్తున్నయని పేర్కొంది. పిల్లలు అపరిచితుల్ని నేరుగా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది ప్రమాదకరం. పోర్నోగ్రఫీని ప్రోత్సహించేలా ఉంది” అని వ్యాఖ్యానించింది. టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేయాలని, డౌన్‌లోడ్స్‌ను నిషేధించాలని, టిక్‌టాక్ వీడియోలు మీడియా ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఏప్రిల్‌ 3నాటి మద్రాస్‌ కోర్టుతీర్పును సవాల్‌ చేస్తూ బైటెన్స్ టెక్నాలజీ అభ్యర్థను సుప్రీంకోర్టు ఆశ్రయించింది. కింది కోర్టు తీర్పును సమర్ధించిన చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ నేతృత్వంలోని కమిటీ తదుపరి విచారణను ఈ నెల( ఏప్రిల్) 22కి వాయిదా వేసింది. మరోవైపు ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌, హాంకాంగ్, ఇండోనేషియా దేశాల్లో దీనిపై పూర్తి నిషేధం అమల్లో ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -